పాన్ ఇండియా క్రెజిస్ట్ ప్రాజెక్ట్ గా డిసెంబర్ 4 వ తేదీన బెనిఫిట్ షో తో మొదలైన పుష్ప గాడి రూల్ ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. ఇందులో తప్పెవరిది, నింద ఎవరి మీద వెయ్యాలి అనేదాని కన్నా ఒక కుటుంబానికి జరిగిన తీర్చలేని నష్టాన్ని గురించి ఆలోచించాలి.
అయితే ఇదంతా అర్ధరాత్రి బెనిఫ్ట్ షో లకు ప్రభుత్వాలు అనుమతి నివ్వడం మూలానే అంటూ కొందరు, ఆ సమయంలో క్రౌడ్ ఎక్కువగా ఉంటారని తెలిసి కూడా అక్కడికి హీరో అల్లు అర్జున్ రావడాన్ని తప్పుబడుతూ మరికొందరు, అసలు తొక్కిసలాటను అధికారులు నివారించలేకపోయారు అంటూ మరికొందరు ఇలా ఒక్కొక్కరు ఒక్కో అభిప్రాయాన్ని వ్యక్త పరుస్తున్నారు.
Also Read – ఈ విందుని జగన్ జీర్ణించుకోలేరేమో?
ఈ నేపథ్యంలో పుష్ప టీం మీద క్రిమినల్ కేసు కూడా నమోదయ్యింది. అధికారులు, హీరో బన్నీ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం ఫలితంగానే ఒక మహిళ మృతి చెందిందని, అలాగే అదే కుటుంబానికి చెందిన బాలుడు అకస్మారక స్థితిలోకి వెళ్లారంటూ పిటిషన్ లో పేర్కున్నారు. దీనికి తోడు ఈ వివాదం జాతీయ మానవ హక్కుల కమిషన్ ముందుకు వెళ్ళింది.
దీనితో ఎలెర్ట్ అయినా తెలంగాణ ప్రభుత్వం బెనిఫిట్ షో ల నిర్వహణ మీద స్పందించింది. తెలంగాణ సినిమాటో గ్రఫీ మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ పుష్ప సినిమా బెనిఫిట్ షో సమయంలో జరిగిన దుర్ఘటన మీద విచారం వ్యక్తం చేస్తూ ఇక పై తెలంగాణలో ముందస్తు షో లకు అనుమతులు ఇవ్వబోమని ప్రకటించారు.
Also Read – అక్కడ కవిత.. ఇక్కడ గుడివాడ సేమ్ టూ సేమ్!
తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో సంక్రాతి బరిలో థియేటర్ల ముందుకు రాబోతున్న రాంచరణ్ పాన్ ఇండియా మూవీ గేమ్ ఛేంజర్ కు ఊహించని షాక్ ఎదురయినట్టే. సంక్రాంతికి టాలీవుడ్ నుంచే 10 న చెర్రీ గేమ్ ఛేంజర్, 12 న బాలకృష్ణ డాకు మహారాజ్, 14 న వెంకీ సంక్రాంతికి వస్తున్నాం ఫ్యామిలి ఎంటర్టైనర్ మొత్తం మూడు సినిమాలు బరిలో దిగనున్నాయి.
ఇందులో చెర్రీ గేమ్ ఛేంజర్ మూవీ కి ఈ బెనిఫిట్ షో ల రద్దు నిర్ణయం మూవీ కలెక్షన్ల మీద పెద్ద ప్రభావమే చూపబోతుంది అంటున్నారు సినీ వర్గాలు. మొదటి నుంచి గేమ్ ఛేంజర్ మూవీ కి ఎదో రూపంలో అడ్డంకులు కలుగుతూనే వస్తున్నాయి. మరి ఈ అడ్డంకులను అధిగమించి టాలీవుడ్ పాన్ ఇండియా సెంటిమెంట్ దేవర, పుష్ప విజయాలను చెర్రీ గేమ్ ఛేంజర్ కొనసాగించగలుగుతుందా.?