పుష్పా టీమ్ కు పుణ్యం పురుషార్థం రెండు దక్కలేదు

fahadh faasil - pushpa villain

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కరోనా పాజిటివ్ రావడంతో పుష్పా షూటింగ్ ఆగిపోయింది. కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో టాలీవుడ్ లో పెద్ద సినిమాల షూటింగ్లు అన్నీ ఆగిపోయాయి. అయితే పుష్పా షూటింగ్ మాత్రం నిర్విరామంగా ఎక్కువ మంది తోనే జరిగింది. దీని మీద పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన్నా మలయాళం సూపర్ స్టార్ ఫహద్ ఫాసిల్ డేట్స్ వెస్ట్ అయితే మళ్ళీ దొరకవు కాబట్టి షూటింగ్ చేశారు.

ADVERTISEMENT

అయితే అల్లు అర్జున్ కు పాజిటివ్ వచ్చాకా ఫహద్ ఫాసిల్ పరిస్థితి సీరియస్ అని గ్రహించి కొచ్చిన్కు వెళ్ళిపోయాడు. “ఫహద్ యొక్క తేదీలను వృథా షూట్ జరిగింది. కాని చివరికి షూటింగ్ ఆపాల్సి వచ్చింది. కోవిడ్ సెకండ్ వేవ్ తగ్గిన తరువాత ఫహద్ తేదీలను పొందడం చాలా సవాలుగా ఉంటుంది, ఎందుకంటే అతను చాలా బిజీ నటుడు” అని

ఆ రకంగా షూటింగ్ ఆపలేదని మాటలూ పడ్డారు అలా అని అనుకున్నదీ అవ్వలేదు. పుణ్యం పురుషార్థం రెండు దక్కలేదు టీమ్ కు. పుష్పాను ఆగస్టు 13 విడుదలకు ముందే ప్రకటించినప్పటికీ ఈ జాప్యం కారణంగా సినిమా వాయిదా పడే అవకాశం ఉంది. దేశంలో పరిస్థితి సాధారణమైన తర్వాతే ఈ బృందం కొత్త విడుదల తేదీ గురించి ఆలోచిస్తుంది.

ఈ నిర్ణయం ఫహద్ సహకారం మీద కూడా ఆధారపడి ఉంటుంది. కోవిడ్ సెకండ్ వేవ్ తగ్గగానే టాలీవుడ్ లో విపరీతమైన రష్ ఉంటుంది. రిలీజ్ డేట్ల కోసం ఎక్కడా లేని డిమాండ్ ఉంటుంది. ఆ తరుణంలో మంచి డేట్ దొరకడం అనేది అందరికీ ఛాలెంజ్ అనే చెప్పుకోవాలి. ఈ తరుణంలో అందరు స్టార్లతో పాటు బన్నీకి కూడా ఇబ్బంది తప్పదు అనే చెప్పుకోవాలి.

ADVERTISEMENT
Latest Stories