ట్రైలర్ టాక్ – బోల్డ్ గర్ల్… గుడ్ బాయ్…!

“ప్యార్ ప్రేమ కాదల్” పేరుతో ఇటీవల తమిళంలో విడుదలైన మూవీని అదే పేరుతో తెలుగులోకి అనువదించబోతున్నారు. హాట్ అండ్ బోల్డ్ మూవీగా పేరు తెచ్చుకున్న ఈ సినిమా తెలుగు ట్రైలర్ ను చిత్ర యూనిట్ తాజాగా విడుదల చేసింది. మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా విడుదలైన ఈ ట్రైలర్ టాలీవుడ్ యూత్ కు కనెక్ట్ అయ్యేలా కనపడుతోంది.

[m9ad]

ADVERTISEMENT

నవతరం కుర్రకారు ఆలోచనలకు దగ్గరగా ఉండే ఓ బోల్డ్ అమ్మాయి… పప్పుసుద్ధలా ఉండే ఓ అబ్బాయి… ఈ ఇద్దరి మధ్య సాగే సన్నివేశాలు ఫన్నీగా ఉన్నాయి. దీనికి యువాన్ శంకర్ రాజా అందించిన సంగీతం అదిరిపోయింది. నిజానికి ఈ ట్రైలర్ ను ప్రేక్షకులకు కనెక్ట్ చేయడంలో డైలాగ్స్ తో పాటు యువాన్ అందించిన మ్యూజిక్ చాలా కీలకపాత్ర పోషించింది.

టాలీవుడ్ లో బోల్డ్ కంటెంట్ తో వస్తున్న చిత్రాలకు లభిస్తోన్న ప్రజాధరణ రీత్యా, ఈ సినిమా కూడా ప్రేక్షకులకు చేరువయ్యే అవకాశం లేకపోలేదు. ముఖ్యంగా హీరోయిన్ రైజాలో రకుల్ ప్రీత్ సింగ్ ముఖ కవళికలు కనిపిస్తుండడం విశేషం. ఇలాన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో హరీష్ కళ్యాణ్ హీరోగా నటించాడు.

ADVERTISEMENT
Latest Stories