వన్ మినిట్ వీడియోను వదిలారు… బాగుంది..!

Raarandoi Veduka Chuddam 1 Min Video Songచైతూ, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన “రారండోయ్ వేడుక చూద్దాం” సినిమాను ఈ శుక్రవారం నాడు ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్న విషయం తెలిసిందే. దీంతో పబ్లిసిటీ జోరుగా సాగుతోంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా ఫుల్ ఆడియోను విడుదల చేయగా, దేవిశ్రీప్రసాద్ అందించిన పాటలు శ్రోతలను ఆకట్టుకోవడంలో విజయవంతం అవుతున్నాయని ఫస్ట్ టాక్ వెలువడింది.

ఇదే ఊపును ప్రేక్షకుల్లో కొనసాగించేందుకు తాజాగా టైటిల్ సాంగ్ కు సంబంధించిన వీడియో సాంగ్ ను చిత్ర యూనిట్ విడుదల చేసారు. ఒక నిముషంకు పైగా సాగిన ఈ వీడియో సాంగ్ లో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ లంగా, వోణీ కాస్ట్యూమ్స్ లో అచ్చ తెలుగు అమ్మాయిలా అదిరిపోయే హావభావాలను పలికిస్తూ దర్శనమిస్తుండగా, చైతూ కూడా ఫ్రెష్ లుక్ తో అభిమానులను అలరించే విధంగా కనపడుతున్నాడు.

ADVERTISEMENT

అలాగే రాబోయే పెళ్లి సందడిలలో ఈ పాట ఖచ్చితంగా మోగేలా రామజోగయ్య శాస్త్రి అందించిన లిరిక్స్ ఉన్నాయి. ఆడియో పరంగా ఇప్పటికే మంచి టాక్ తెచ్చుకున్న ఈ పాట విజువల్ గా, దానిని మరింత హైలైట్ చేసే విధంగా ఉంది. సాధారణంగా విడుదలకు ముందు తెలుగు సినిమాల వీడియో సాంగ్స్ ను పబ్లిసిటీ పరంగా వినియోగించరు గానీ, నాగార్జున రూట్ సపరేట్ గనుక, ప్రేక్షకుల పైకి ఈ వీడియో సాంగ్ ను వదిలారు.

ADVERTISEMENT
Latest Stories