రేటింగ్స్ దారుణం… కలెక్షన్స్ కేక..!

Race 3 Delivers Poor Ratings good collectionsఈ శుక్రవారం నాడు విడుదలైన సల్మాన్ ఖాన్ “రేస్ 3” సినిమాకు విమర్శకుల నుండి దారుణమైన రేటింగ్స్ లభించాయి. దీంతో సల్మాన్ కెరీర్ లో మరో డిజాస్టర్ ను మిగులుస్తుందేమోనని ట్రేడ్ వర్గాలు భావించాయి. కానీ రంజాన్ పర్వదినం సల్మాన్ పాలిట మరోసారి వరమైందని “రేస్ 3” కలెక్షన్స్ చెప్పకనే చెప్తున్నాయి.

తొలిరోజు నాడు 29.17 కోట్లు కొల్లగొట్టిన ‘రేస్ 3’ రెండవ రోజు రంజాన్ నాడు 38.14 కోట్లు వసూలు చేసింది. ఇక కీలకమైన ఆదివారం నాడు కూడా అదే ఊపును కొనసాగిస్తూ ఏకంగా 38 కోట్లను వసూలు చేయడంతో తొలి మూడు రోజుల్లోనే 105 కోట్లు వసూలు చేసింది. తొలిరోజు వెలువడిన రేటింగ్స్ నుండి ‘రేస్ 3’ బయటపడినట్లే భావించవచ్చు.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories