వైజాగ్ లోనే జగన్ ప్రమాణ స్వీకారం : ఆర్ఆర్ఆర్!

YS Jagan and Raghu Rama Raju

2019లో వైసీపీ తరపున ఎన్నికల బరిలోకి దిగి నరసాపురం ఎంపీ అయిన రఘురామకృష్ణంరాజు, పట్టుమని నెల రోజులు కూడా పార్టీలో ఇమడలేక తిరుగుబావుట ఎగుర వేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత జరిగిన “జగన్నాటక” రాజకీయ పరిణామాలు అందరికి తెలిసినవే.

ADVERTISEMENT

నిజానికి జగన్ కు ఎదురుగా తొలి వ్యతిరేక గళం వినిపించింది రఘురామకృష్ణంరాజే. అలా అయిదేళ్ల పాటు నిర్విరామంగా జగన్ పై పోరాడిన ఆర్ఆర్ఆర్, ఈ ఎన్నికలలో ఉండి నియోజకవర్గం నుండి టీడీపీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసిన విషయం తెలిసిందే.

ఈ సారి లోక్ సభ కాదు, శాసనసభలో ఆర్ఆర్ఆర్ అడుగుపెట్టడం ఖాయమని సర్వేలు చెప్తుండగా, కూటమి ప్రభుత్వం ఘనవిజయం సాధించబోతుందని ఇప్పటికే పలుమార్లు మీడియా ముఖంగా వెల్లడించిన విషయం తెలిసిందే.

అయితే ఒకడుగు ముందుకు వేస్తూ వైజాగ్ లో జూన్ 9వ తేదీన ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని వైసీపీ చేస్తోన్న ప్రచారం పట్ల తనదైన శైలిలో ఎటకారాన్ని పుష్కలంగా పండించారు ఆర్ఆర్ఆర్.

వైజాగ్ లో జగన్ ప్రమాణ స్వీకారం చేయబోయేది నిజమేనని, దానికి స్థలాన్ని కూడా నిర్ధేశించారని, వైజాగ్ పిచ్చాసుపత్రిలో పెట్టుకుంటారని ఆర్ఆర్ఆర్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియా అంతటా వైరల్ అవుతున్నాయి.

అసలే సర్వేలన్నీ తమకు ప్రతికూలంగా ఉండడంతో మింగలేక, కక్కలేక అన్న రీతిలో ఉన్న జగన్ అండ్ కో వర్గానికి, ఆర్ఆర్ఆర్ వ్యాఖ్యలు ‘పుండు మీద కారం’ జల్లినట్లుగా ఉన్నాయి.

గత అయిదేళ్లుగా నిత్యం ‘రచ్చబండ’ కార్యక్రమం ద్వారా యూట్యూబ్ లో వైసీపీ మొత్తాన్ని ఏకిపారేసిన ఆర్ఆర్ఆర్ గెలిస్తే, జగన్ కు కంటి మీద కునుకు ఉండబోదన్న ప్రచారం ఇప్పటికే రాజకీయ వర్గాల్లో ముమ్మరంగా జరుగుతోంది.

ఆర్ఆర్ఆర్ గెలిస్తే కూటమి ప్రభుత్వం తరపున అసెంబ్లీ స్పీకర్ గా బాధ్యతలు చేపడతారని పొలిటికల్ సర్కిల్స్ లో పెద్ద ఎత్తున జరుగుతున్న ప్రచారానికి తోడు సోషల్ మీడియాలో వస్తోన్న మేమ్స్ వైసీపీ అభిమానులకు తీవ్ర మనోవేదనను మిగులుస్తున్నాయి.

ADVERTISEMENT
Latest Stories