‘ఆర్ఆర్ఆర్’ ఎక్స్ ప్రెషన్స్… భావమేమి..?

Raghu-Rama-Raju in Parliamentపార్లమెంట్ వేదికగా మరోసారి ఏపీ దుస్థితి గురించి ఎంపీ మిథున్ రెడ్డి తన స్వరాన్ని వినిపించారు. “ఏపీ భవిష్యత్తు ఆందోళనకరంగా ఉందని, ఆర్ధికంగా భరించలేని స్థాయిలో ఉన్నామని, అస్తవ్యస్తంగా ఉన్న ఆర్ధిక కష్టాల నుండి బయటపడే మార్గం కనిపించడం లేదు, ఆదుకోవాలంటూ” కేంద్రాన్ని మరోమారు విజ్ఞప్తి చేసారు.

ఇలా వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ప్రసంగిస్తుండగా, వెనుకాల ఉన్న మరో ఎంపీ రఘురామకృష్ణంరాజు పలికించిన హావభావాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పార్టీలోనే ఉంటూ వైసీపీ వర్గాలకు సినిమా చూపిస్తున్న నేతగా సోషల్ మీడియాలోనూ, ప్రజలలోనూ ఆర్ఆర్ఆర్ కు విశేషమైన ఆదరణ వచ్చింది.

ADVERTISEMENT

ఏ రోజు జరిగిన విశేషాలను ఆ రోజే మీడియాలో లైవ్ కి వస్తూ తనదైన గోదావరి ఎటకారాన్ని పండించడం ఆర్ఆర్ఆర్ డైలీ రొటీన్ కార్యక్రమాలలో ఒకటి. వైసీపీకి కొరకరాని కొయ్యగా మారిన ఈ ఎంపీపై ఎలాంటి చర్యలు తీసుకోలేని నిస్సహాయ స్థితిలో ఉండడం, రఘురామకృష్ణం రాజుకు మరింత బలాన్నిచ్చినట్లయ్యింది.

ఇంతకీ ఆర్ఆర్ఆర్ పలికించిన ఎక్స్ ప్రెషన్స్ లో భావమేమిటి? నెటిజన్లు అయితే ఒక్కొక్కరు ఒక్కో విధంగా స్పందిస్తున్నారు. నేడు రాష్ట్రం ఈ పరిస్థితిలో ఉండడానికి కారణం ఈ ప్రభుత్వమే కదా, మళ్ళీ మీరే వచ్చి సహాయ పడండి అంటూ ప్రాధేయపడడం ఏమిటో? అనేది ఆర్ఆర్ఆర్ ఇన్నర్ ఫీలింగ్ కాదు, ఔటర్ ఫీలింగ్! ఇప్పటికే వివిధ సందర్భాలలో ఈ విషయాన్ని తెలిపారు.

ADVERTISEMENT
Latest Stories