సెంచరీ కొట్టడు… హాఫ్ సెంచరీ కొట్టకుండా అవ్వడు..!

Rahul - India Vs Australia Test Seriesఆస్ట్రేలియాతో టీమిండియా తలపడుతున్న నాలుగు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం ధర్మశాలలో జరుగుతున్న చివరి టెస్ట్ రెండవ రోజు ముగిసింది. ఆసీస్ చేసిన 300 పరుగులకు టీమిండియా రెండవ రోజు ముగిసే సమయానికి 248 పరుగులు చేసి 6 వికెట్లు కోల్పోయింది. క్రీజులో కీపర్ సాహా 10, రవీంద్ర జడేజా 16 పరుగులతో ఉండగా, ఆసీస్ ను అందుకోవాలంటే ఇంకా 52 పరుగులు చేయాల్సి ఉంది. ఒక్క వికెట్ పడితే ఇక మిగిలినవారంతా టైల్ ఎండర్స్ కావడంతో, ఈ భాగస్వామ్యం టీమిండియాకు కీలకంగా మారింది.

ఇక, రెండవ రోజు బ్యాటింగ్ ప్రారంభించిన కాసేపటికే ఓపెనర్ మురళీ విజయ్ 11 పరుగులకే వెనుదిరిగాడు. అయితే మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ మాత్రం అద్భుతమైన బ్యాటింగ్ ప్రతిభతో మరోసారి అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ సిరీస్ లో రాహుల్ కు వరుసగా అయిదవ అర్ధ సెంచరీ కావడం విశేషం. తొలి టెస్ట్ రెండవ ఇన్నింగ్స్ లో 64 పరుగులతో ప్రారంభించిన రాహుల్ బ్యాటింగ్ రికార్డులలో బెంగుళూరు టెస్ట్ లో 90, 51 పరుగులు చేయగా, రాంచీ టెస్ట్ లో 67 పరుగులు చేసాడు. తాజాగా మొదటి ఇన్నింగ్స్ లో 60 పరుగులతో సత్తా చాటాడు.

ADVERTISEMENT

రాహుల్ పరిస్థితి ఎలా ఉందంటే… సెంచరీ కొట్టట్లేదు, అలాగని అర్ధ సెంచరీ కొట్టకుండా అవ్వట్లేదు. సిరీస్ లో మంచి ఫాంలో ఉన్న పుజారా కూడా (57) అర్ధ సెంచరీ చేయడంతో ఒకానొక దశలో టీమిండియా పటిష్ట దశలో ఉన్నట్లు కనిపించింది. అయితే పుజారా ఔటైన తర్వాత కరుణ్ నాయర్ (5) స్వల్ప స్కోర్ కే వెనుదిరిగాడు. అలాగే కెప్టెన్ రెహనే (46), అశ్విన్ (30) పరుగులు చేసి పెవిలియన్ కు చేరుకున్నారు. చివర్లో సాహా అందించిన క్యాచ్ ను స్లిప్ లో ఉన్న రెయిన్ షా జారవిడవడంతో టీమిండియా మరో వికెట్ కోల్పోకుండా రోజును ముగించింది.

మూడవ రోజు ఏ జట్టు కొడితే మ్యాచ్ లో, సిరీస్ లో ఆధిపత్యం వారిదే అనిపించే విధంగా మ్యాచ్ తీరు ఉంది!

ADVERTISEMENT
Latest Stories