స్వర్గీయ ఎన్టీఆర్ కోసం రాజమౌళి ప్రచారం!

rajamouli-Legendary-NTR-Blood-Donationనందమూరి తారక రామారావు స్వర్గస్తులై ఈ నెల 18వ తేదీకి 20 సంవత్సరాలు పూర్తవుతోంది. ఇన్నేళ్ళు గడిచినా… తెలుగు రాష్ట్ర రాజకీయాలను, సినీ పరిశ్రమను శాసిస్తున్న పేరుగా “ఎన్టీఆర్” ఉందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదేమో! ఈ 20 సంవత్సరాలను పురస్కరించుకుని ఏపీ, తెలంగాణా రాష్ట్రాలలో దాదాపు 200 కేంద్రాలలో రక్తదాన శిభిరాలు నిర్వహిస్తున్నారు.

“లెజెండరీ బ్లడ్ డోనేషన్ డ్రైవ్” పేరుతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ప్రజల్లో విస్తృత ప్రచారం కల్పించడానికి దర్శక దిగ్గజం రాజమౌళి సైతం ముందుకు వచ్చి ‘బైట్’ ఇచ్చారు. రాజమౌళితో పాటు, రాఘవేంద్రరావు, వి.వి.వినాయక్, బోయపాటి శ్రీను, పరుచూరి గోపాలకృష్ణ, కీరవాణి, పుల్లెల గోపీచంద్ వంటి ప్రముఖులు అలాగే, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, సతీమణి భువనేశ్వరి, నందమూరి బాలకృష్ణలతో కూడిన వీడియో సోషల్ మీడియాలో సందడి చేస్తోంది.

ADVERTISEMENT

రెడ్ క్రాస్, రోటరీ క్లబ్, లయన్స్ క్లబ్ మరియు గవర్నమెంట్ బ్లడ్ బ్యాంక్స్ ఆధ్వర్యంలో నిర్వహించబోతున్న ఈ రక్తదాన శిభిరాన్ని విజయవంతం చేసి, ఆ మహనీయుడికి ఘనమైన నివాళి ఇవ్వాలని వీరంతా కోరుతున్నారు. ఇక, చూసుకోవడం అభిమానుల వంతు!

ADVERTISEMENT
Latest Stories