అదే జరిగితే…ఆయన మార్కెటింగ్ లెజెండ్ అయిపోతాడు!

Rajamouli marketing legendఒక పక్క బాహుబలి…మరో పక్క రోబో సినిమాలు..ఖచ్చితంగా ఈ రెండు సినిమాలు ఇండియన్ సినిమా అన్న పదం ఉన్నంతవరకూ చరిత్రలో నిలిచిపోయే సినిమాలే. అయితే ఏది గొప్ప…అన్న మాట కాసేపు పక్కన పెడితే…ఈ రెండు సినిమాలు మంచి ఆదరణ పొందిన సినిమాలే. ఇక ఈ రెండు సినిమాల మధ్య ఉన్న చిన్న పాటి వ్యత్యాసం ఏంటి అంటే..ఈ రెండింటిలో ముఖ్యంగా ఈ సినిమాల సెకండ్ పార్ట్ కి వచ్చేసరికి…అంటే బాహుబలి 2 మరియు రోబో 2 .0 ఈ రెండు సినిమాల్లో బాహుబలికి వచ్చిన క్రేజ్, అన్ని కలెక్షన్స్ కానీ రోబో 2 .0 కి రాకపోవడానికి అసలు కారణం పబ్లిసిటీఅనే చెప్పాలి.

[m9ad]

ADVERTISEMENT

ఎందుకంటే బాహుబలి 2 కి రాజమౌళి ఒకే ఒక్క డైలాగ్ తో “బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు” అన్న ఒకే ఒక్క డైలాగ్ తో సెకండ్ పార్ట్ మొత్తం నడిపించాడు. మరో పక్క బాహుబలి తోలి భాగం భారీ హిట్ కావడంతో అసలు రెండో భాగంలో ఏం జరగబోతుందో అన్న ఆలోచనతో అందరూ థియేటర్స్ కి పరుగులు పెట్టారు. అయితే రోబో 2 కి మాత్రం ఆ అవకాశం లేదు. అందుకే ప్రొమోషన్స్ విషయంలో ఈ సినిమా బాహుబలి రేంజ్ ని అందుకోలేక పోయింది. అయితే మరో పక్క రాజమౌళి తాజాగా తెరకెక్కిస్తున్న “ఆర్. ఆర్. ఆర్” సినిమా కూడా గ్రాఫిక్స్ తో కూడిన సినిమా అని తెలుస్తూ ఉండడంతో, ఈ సినిమా కథ స్వతంత్ర ఉద్యమం తాక ముందు కథ అన్న కహానీలు వినిపిస్తూ ఉన్నప్పటికీ ఈ సినిమా ప్రమోషన్ రాజమౌళి ఎలా చేస్తాడు అన్న ఆలోచనే అందరినీ ఆలోచింపజేస్తుంది.

అయితే ఇద్దరు టాలీవుడ్ టాప్ హీరోలు ఉన్నప్పటికీ ఈ సినిమా ప్రమోషన్ ఎంత డిఫరెంట్ గా ఉంటే అంత మంచిది అన్నది ప్రేక్షకుల ఆలోచన. మరి ఈ సినిమా ప్రొమోషన్స్ లో జక్కన్న ఎలాంటి కొత్త యాంగిల్ ని బయటకు తీస్తాడో తెలీదు కానీ, మొత్తంగా చూసుకుంటే మాత్రం ఆయన సరికొత్త విధానంలో ప్రొమోషన్స్ మొదలు పెడితే మాత్రం రాజమౌళి సినిమా మార్కెటింగ్ లో ఒక లెజెండ్ గా మిగిలిపోతాడు అని చెప్పవచ్చు. చూద్దాం మరి ఏం చేస్తాడో.

ADVERTISEMENT
Latest Stories