అనుష్క సినిమాకు జక్కన్న సలహాలు

rajamouli baahubali part2టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి గురువు దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు. తన గురువు కుమారుడు ప్రకాష్‌ కోవెలమూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘సైజ్‌ జీరో’ చిత్రాన్ని తాజాగా రాజమౌళి చూశాడట. సినిమా చూశాక ఎడిటింగ్‌లో కొన్ని మార్పులు చేర్పులు చేయించినట్లుగా తెలుస్తోంది. అలాగే స్క్రిప్ట్‌ విషయంలో కూడా దర్శకుడు ప్రకాష్‌ అప్పుడప్పుడు దర్శక ధీరుడు రాజమౌళి సలహాలు సూచనలు తీసుకున్నట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యుల ద్వారా తెలుస్తోంది.

‘సైజ్‌ జీరో’ విడుదల సందర్బంగా చిత్ర యూనిట్‌ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ జక్కన్న సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. ఈ చిత్రానికి జక్కన్న పూర్తి సహాయ సహకారాన్ని అందించాడు. దాంతో ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుందని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇక ఈ సినిమాలో నటించిన అనుష్క ప్రస్తుతం జక్కన్న ‘బాహుబలి’ చిత్రంలో నటిస్తున్న విషయం తెల్సిందే. ఆ కారణం చేత కూడా జక్కన్న ఈ సినిమాపై మరి కాస్త శ్రద్ద పెట్టి ఉంటాడు అని సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా దర్శకుడు ప్రకాష్‌ కోవెలమూడికి గుర్తింపు తెస్తుందా అనేది ఆసక్తికర అంశంగా ఉంది.

ADVERTISEMENT
Latest Stories