భారీ అంచనాల మధ్య విడుదలయిన రజనీకాంత్ రోబో-2 భారీగానే వసూళ్లు సాధిస్తుంది. అయితే ఆ భారీతనం రజనికాంత్ రేంజ్ కి కాస్త తగ్గినట్లుగానే కనిపిస్తుంది. ఇక ఈరోజు, రేపు వారాంతరం కావడం, మిగిలిన సినిమాలు ఏమీ బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా సందడి చెయ్యకపోవడం చూస్తూ ఉంటే, ఈ వీకెండ్ బాక్స్ ఆఫీస్ ని మన “బాషా” దంచి కొడతాడు అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇదిలా ఉంటే మరో పక్క ఇప్పటివరకూ ఈ సినిమా కలెక్షన్స్ పరంగా అనుకున్నంత రేంజ్ ని నెలకొల్పలేనప్పటికీ మరో రకంగా దాదాపుగా అయిదు రికార్డులను నమోదు చేసింది ఈ సినిమా.
[m9ad]
ఆ రికార్డుల వివరాల్లోకి వెళితే…హిందీ విషయానికే వస్తే ఈ సినిమా తొలి రోజు 20 నుంచి 25 కోట్ల వరకూ వసూళ్లు సాధిస్తుంది అని అనుకున్నారు నిర్మాత కరణ్ జోహార్..అయితే అంతకు మించి ఈ సినిమా దాదాపుగా ప్రపంచ వ్యాప్తంగా 26 కోట్ల వసూళ్లు హిందీ వర్షన్ లో సాధించి బాహుబలి సినిమా తర్వాత డబ్బింగ్ సినిమా రిలీజ్ చరిత్రలో ఇదే రికార్డ్. ఇక రెండు తెలుగు రాష్ట్రాలకే వస్తే రజనీకాంత్ కరియర్ లోనే తొలి రోజు 18 కోట్ల గ్రాస్ షేర్ ని వసూలు చేసిన సినిమాగా రికార్డును నెలకొల్పింది. ఇక తమిళ నాట తొలిరోజే 26.7 కోట్ల గ్రాస్ ను వసూలు చేసి, తన గత రికార్డు కాలా 17 కోట్లని తానే బద్దలు కొట్టుకున్నాడు రజనీకాంత్. మరో పక్క బాహుబలి తర్వాత డబ్బింగ్ సినిమా చరిత్రలో తొలి రోజే 100కోట్ల క్లబ్ లో చేరిన సినిమాగా మరో మైలు రాయిని అందుకుని రోబో 2.0.
ఇవే కాకుండా హింది హీరో అక్షయ్ కుమార్ కరియర్ లోనే అంత భారీ హిట్స్ అయిన గోల్డ్, పద్మన్, జాలీ ఎల్.ఎల్.బీ2, సినిమాలు కూడా తొలి రోజు రాబట్టలేని 100కోట్ల వసూళ్లని ఈ సినిమాతో సాధించి అక్షయ్ కరియర్ లో ఒక మైలు రాయిగా నిలిచింది ఈ సినిమా…మొత్తంగా బాహుబలిని కొట్టే సినిమాగా ట్రేడ్ వర్గాలు, అభిమానులు ఈ సినిమాని రిలీజ్ కి ముందు చెప్పినప్పటికీ, ఇదిగో ఈ రికార్డ్స్ తో సరిపెట్టుకోక తప్పడం లేదు అని చెప్పక తప్పదు.



