‘సూపర్ స్టార్’ రేంజ్ పై విదేశీ మీడియా ‘సూపర్’ కధనం!

Rajinikanth, Rajinikanth Kabali, Rajinikanth Kabali The New York Times, Rajinikanth Kabali Movie The New York Times, Rajinikanth Kabali New York Times“భారత చలనచిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్ రజనీకాంత్ అతి పెద్ద స్టార్” అంటూ విదేశీ మీడియా ‘ది వాషింగ్టన్ పోస్ట్’ ‘కబాలి’ చిత్రం గురించిన విశేషాలు చెబుతూ “కబాలి ఫ్యాన్ మేనియానే కొలమానం” అనే ఒక ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. 65 ఏళ్ల వయసున్న రజనీకాంత్, అదే వయసున్న ఇతర నటులతో పోలిస్తే, ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నారని, ఏ రాజకీయ నాయకుడికీ లేనంత మంది అభిమానగణం రజనీ సొంతమని తెలిపింది.

ADVERTISEMENT

తన సినిమాకు సంబంధించి ఒక చిన్న టీజర్ ని విడుదల చేస్తే, వారం రోజుల్లో 3 కోట్ల మందికి పైగా వీక్షించారని, రజనీ సమ్మోహన శక్తి అలాంటిదని ప్రశంసలు కురిపించింది. శివాజీ రావ్ గైక్వాడ్ గా పుట్టిన జీవితంపై క్లుప్తంగా చెబుతూ… కానిస్టేబుల్ కొడుకైన శివాజీ, కార్పెంటర్ విధులను, రైల్వేల్లో మూటలను మోశారని, ఆపై బస్ కండక్టరుగా పనిచేశారని, ఓ సినిమా దర్శకుడు శివాజీని చూసి, తన చిత్రంలో భార్యను, చెల్లిని వేధించే భర్త వేషం ఇచ్చారని, ఆపై దశాబ్దానికే ‘శివాజీ రావ్ గైక్వాడ్’ కాస్త ‘రజనీకాంత్’గా మారి సూపర్ స్టార్ గా ఎదిగారని పేర్కొంది.

వెండితెరపై రజనీ సన్ గ్లాస్ లను తిప్పే విధానం, సిగరెట్ వెలిగించే పద్ధతులు అభిమానులను ఎంతో అలరిస్తాయని, ఆ స్టయిలే తిరుగులేని కథానాయకుడిగా నిలబెట్టిందని పేర్కొంది. నిజజీవితంలో ఎంతో సింపుల్ గా ఉంటారని, ఆధ్యాత్మిక భావాలు చాలా ఎక్కువని తెలిపింది. రజనీ చిత్రం విడుదలవుతుంటే వేల లీటర్ల పాలతో అభిమానులు అభిషేకాలు చేస్తారని, ‘కబాలి’ విషయంలో మాత్రం అధిక పాల ధరలు, అభిమానుల్లో పాలపై చైతన్యం తెచ్చిన స్వచ్ఛంద సంస్థల కారణంగా, పాలాభిషేకాలు తగ్గాయని ‘ది వాషింగ్టన్ పోస్ట్’ తెలిపింది.

ఈ చిత్రాన్ని చూసేందుకు చెన్నైలోని ఓ థియేటరు వద్ద కిలోమీటరు దూరం సాగిన క్యూలో ఉన్న 26 సంవత్సరాల మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ఆంటోనీ రాజ్ కుమార్ ని ఇంత అవస్థలు పడటం అవసరమా? అని ప్రశ్నించగా, “మీ భార్య బిడ్డను కంటే, ఆ బిడ్డను చూసేందుకు కొన్ని రోజులు ఆగడం అవసరమా?” అన్న సమాధానం ఒక ప్రశ్న రూపంలో ఎదురైందని, రజనీకాంత్ స్టామినాకు ఇదే నిదర్శనమని ఆ కథనం తెలపడం, ‘సూపర్ స్టార్’ అభిమానులను ఖుషీ చేసింది.

ADVERTISEMENT
Latest Stories