ఒక ప్రాంతీయ భాష చిత్రంగా ఇండియన్ సినిమా రికార్డులను ‘బాహుబలి.’ ఈ సినిమా మొదటి టీజర్ విడుదలై, యూ ట్యూబ్ రికార్డులు నెలకొల్పడం నాటి నుండి ఇండియన్ సినీ హిస్టరీలో అత్యధిక వసూళ్ళు సాధించడం వరకు అన్నీ రికార్డులే. అయితే అన్ని రికార్డులను టచ్ చేస్తుందో లేదో గానీ, ‘బాహుబలి’ తొలి రికార్డు అయిన యూ ట్యూబ్ హిట్స్ ను కేవలం 10 రోజుల్లోనే పక్కన పెట్టేసాడు సూపర్ స్టార్.
ఇటీవల విడుదలైన ఆలిండియా సూపర్ స్టార్ రజనీకాంత్ ‘కబాలి’ ఫస్ట్ టీజర్, ఆల్ టైం రికార్డుల దిశగా దూసుకెళ్తోంది. ‘బాహుబలి’ ట్రైలర్ ను ఇప్పటివరకు దాదాపు ఒక కోటి 30 లక్షల హిట్స్ రాగా, 10 రోజుల క్రితం విడుదలైన ‘కబాలి’ టీజార్ ఇప్పటికే ఒక కోటి 60 లక్షల క్లిక్స్ కు చేరువలో ఉంది. దీంతో ‘బాహుబలి’ ఆల్ టైం రికార్డును దాటడానికి సూపర్ స్టార్ రజనీకి పదంటే పది రోజులు కూడా పట్టలేదు. మరి కలెక్షన్స్ లో కూడా ఇలాంటి సత్తానే చాటితే దక్షిణాది సినీ పరిశ్రమకు మరింత గర్వకారణం.



