అవార్డ్స్ వేడుక… బ్యూటీలంతా ఫసక్…!

Rakul Preet Singh - Ileana -Kiara Advaniసినీ వేడుకలపై అదిరిపోయే కాస్ట్యూమ్స్ తో అందాల విందులు చేయడం హీరోయిన్లకు పరిపాటిగా మారిపోయింది. ఒకరికొకరు పోటీపడుతూ వీక్షకులకు కన్నులవిందు చేస్తోన్న ఈవెంట్ లలో తాజాగా ‘వోగ్ విమెన్ ఆఫ్ ది ఇయర్’ జరిగింది. ఈ వేడుకకు బాలీవుడ్ తారామణులతో పాటు టాలీవుడ్ టాప్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కూడా హాజరైంది.

[m9ad]

ADVERTISEMENT

బాలీవుడ్ సుందరీమణులకు ఏ మాత్రం తక్కువ కాకూడదని భావించిందో ఏమో గానీ, రెడ్ కార్పెట్ పై లెమన్ ఎల్లో డ్రెస్ తో అదరగొట్టింది. సహజంగా ఇలాంటి వేడుకలలో బాలీవుడ్ హీరోయిన్లు చేసే అందాల విందు ఎప్పుడూ హాట్ టాపిక్ అవుతూ ఉంటుంది. కానీ ఈ సారి వారితో పాటు మన టాలీవుడ్ సోయగం రకుల్ కూడా చర్చనీయాంశమైంది.

ఇక ఈ వేడుకలో పాల్గొన్న గోవా బ్యూటీ ఇలియానా బ్లాక్ లాంగ్ గౌన్ లో దర్శనమివ్వగా, ‘భరత్ అనే నేను’ ఫేం కియారా అద్వానీ మెరూన్ డ్రెస్ లో మెరిసిపోయింది. అలాగే మాజీ బ్యూటీలు కరిష్మా, కరీనాలతో పాటు లేటెస్ట్ సెన్సేషన్ జాహ్నవి కపూర్ లు తమదైన శైలిలో ప్రత్యక్షం అయ్యారు. ఈ బ్యూటీలంతా కలిసి ఒక్కసారిగా వీక్షకులను ‘ఫసక్’ చేసేస్తున్నారు.

ADVERTISEMENT
Latest Stories