రకుల్ ప్రీత్ సింగ్… అదరగొట్టేసిందిగా..!

Rakul Preet Singh - Rarandoi venduka Choodam Stillsవెండితెరపై తెలుగు హీరోయిన్లు కనిపించేది బహు అరుదు అన్న విషయం తెలిసిందే. ఒకవేళ తేజస్వి వంటి ఒకరిద్దరు హీరోయిన్లు కనిపిస్తున్నప్పటికీ, వారు కూడా వెస్ట్రన్ కాస్ట్యూమ్స్ తో అందాల ఆరబోతను ప్రదర్శిస్తూ… సిల్వర్ స్క్రీన్ ఇంకా హీటేక్కిస్తున్నారు. ఇక ఉత్తరాది నుండి వచ్చిన బ్యూటీల గురించి చెప్పనవసరం లేదు. అయితే ఓ పక్కన అందాలు ఆరబోసే గ్లామర్ పాత్రలను పోషిస్తూనే, మరో పక్కన సంప్రదాయపు పాత్రలు పోషిస్తున్న సమంత వంటి వారు కూడా ఇటీవల కనపడుతున్నారు.

అలాంటి జాబితాలో ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా కొనసాగుతోన్న రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. తాజాగా నాగచైతన్య సరసన “రారండోయ్ వేడుక చూద్దాం” సినిమాలో అచ్చ తెలుగు పదహారణాల అమ్మాయిలా దర్శనమిస్తున్న రకుల్ కు సంబంధించిన ఓ రెండు ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. చూడగానే ‘వావ్…’ అనిపించేలా లంగా, వోణీ కాస్ట్యూమ్స్ తో వీక్షకులను కట్టిపడేస్తోంది ఈ ముద్దుగుమ్మ. బహుశా బికినీలో కనిపించినా గానీ, ఇంత అందంగా ఉండేదేమో గానీ, తెలుగింటి సంప్రదాయపు కాస్ట్యూమ్స్ తో రకుల్ అదరగొట్టేస్తోంది.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories