5 లక్షలు… టాలీవుడ్ టాప్ హీరోయిన్ కధ…!

Rakul Preet Singh Remunerationప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా వెలుగొందుతున్న రకుల్ ప్రీత్ సింగ్, తెలుగు తెరకు ‘కెరటం’ సినిమా ద్వారా పరిచయమైన విషయం తెలిసిందే. అయితే ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ ద్వారా సూపర్ సక్సెస్ రావడంతో, అప్పటి నుండి తిరుగులేని హీరోయిన్ గా చలామణి అవుతోంది. అయితే తెలుగు కంటే ముందు, కన్నడ నాట ఈ ముద్దుగుమ్మ “గిల్లీ” సినిమా ద్వారా రంగప్రవేశం చేసింది.

ఈ సినిమా రకుల్ తీసుకున్న రెమ్యూనరేషన్ తెలిస్తే అవాక్కవ్వకుండా ఉండలేరు. కేవలం 5 లక్షల రూపాయలు తీసుకుని “గిల్లీ” అనే కన్నడ సినిమాలో నటించానని తాజాగా తన అనుభూతులను చెప్పుకొచ్చింది. తను కాలేజీ చదివే రోజుల్లో ఆ సినిమా చేసానని, నిజానికి అప్పుడు తన పాకెట్ మనీ కేవలం 2 వేల రూపాయలు మాత్రమేనని, దానితో పోలిస్తే 5 లక్షలు పెద్ద మొత్తం కావడంతో ‘గిల్లీ’ సినిమా చేసానని చెప్పుకొచ్చింది.

ADVERTISEMENT

అయితే ఆ తర్వాత కూడా కన్నడంలో సినీ ఆఫర్లు వచ్చాయి గానీ, చదువు మీద దృష్టి పెట్టాలనే ఉద్దేశంతో ఇంకేమీ సినిమాలు చేయలేదని, మళ్ళీ చదువు పూర్తయిన తర్వాత మోడలింగ్ లోకి రావడం, ఆ తర్వాత సినీ రంగంలోకి అడుగు పెట్టడం జరిగిపోయిందని చెప్పుకొచ్చింది. కెరీర్ ఎదుగుతూ ఎంత సంపాదించినా… ఆ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఇచ్చే కిక్… పంచే తీపి గుర్తులు… ఆ అనుభూతులే వేరు కదా..!

ADVERTISEMENT
Latest Stories