ఈ స్టార్ హీరోయిన్ కు అంత ఛాన్స్ దక్కిందా?

Rakul Preet Singh Tollywood Offersతెలుగులో సమంత తర్వాత, ఆ స్థాయిలో పెద్ద హీరోల సినిమాల అవకాశాలను దక్కించుకుంటూ సందడి చేస్తోంది రకుల్ ప్రీత్ సింగ్. సినిమాలతో పాటు జిమ్ బిజినెస్ కూడా నడుపుతోన్న ఈ ముద్దుగుమ్మ చేతిలో ప్రస్తుతం బడా హీరోల సినిమాలే ఉన్నాయి. ముఖ్యంగా ‘బాహుబలి’ తర్వాత అంత క్రేజీగా మారిన ప్రాజెక్ట్ ‘స్పైడర్’లో ప్రిన్స్ మహేష్ బాబు సరసన రకుల్ ప్రీత్ సింగే నటిస్తోంది. ఈ సినిమా నాలుగు భాషల్లో విడుదల కానుండడంతో, ఒక్క దెబ్బకు నాలుగు పిట్టలు అన్న చందంగా రకుల్ పరిస్థితి మారింది.

అయితే ప్రిన్స్ సరసన నటించడానికి ఒక్క సినిమాలో అవకాశం రావడమే గగనమని ఎంతో మంది హీరోయిన్లు వేచిచూస్తుంటే… వరుసగా రెండవ అవకాశాన్ని సైతం రకుల్ అందుకుందని లేటెస్ట్ టాక్. కొరటాల శివ దర్శకత్వం వహించబోయే ‘భరత్ అనే నేను’ సినిమా కోసం శృతిహాసన్ ను ఎంపిక చేసారని గతంలో వార్తలు రాగా, కాదు కాదంటూ కొన్ని రోజుల క్రితం కైరా అద్వానీ, దిశా పటానీ పేర్లు హల్చల్ చేసాయి. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం వీరి పేర్లు కూడా ‘అవుట్ ఆఫ్ సిలబస్’గా మారిపోయాయని టాక్.

ADVERTISEMENT

సదరు బాలీవుడ్ బ్యూటీల కన్నా… ఇప్పటికే ప్రిన్స్ పక్కన ‘స్పైడర్’లో నటిస్తోన్న రకుల్ అయితే ఉత్తమమని భావించడంతో… ఎంతోమంది చుట్టూ తిరిగి వచ్చిన అవకాశం మళ్ళీ పక్కనే ఉన్న రకుల్ చెంతకే చేరిందని సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇదే నిజమైతే ప్రిన్స్ సరసన వరుసగా రెండు సినిమాల్లో హీరోయిన్ గా నటించిన ఖ్యాతి రకుల్ సొంతమవుతుంది. ఇప్పటివరకు సమంత మూడు సార్లు, త్రిష రెండు సార్లు నటించినా, వెంటవెంటనే మాత్రం ఎవరికీ ఆ అవకాశం లభించలేదు. దీంతో రకుల్ ప్రీత్ కు అంత అవకాశం దక్కిందా? అన్న టాక్ బాగా వినపడుతోంది.

ADVERTISEMENT
Latest Stories