మెగాస్టార్ సమక్షంలో… పక్కపక్కనే ఎన్టీఆర్ – చరణ్..!

Ram Charan and Jr NTR Of RRR At The Launchఈ దశాబ్దపు అతి పెద్ద మల్టీస్టారర్ మూవీగా భావిస్తున్న “ఆర్ఆర్ఆర్” సినిమా ప్రారంభమైంది. రాజమౌళి సృష్టించబోతున్న మరో అద్భుతంగా కొనియాడుతున్న ఈ సినిమా ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిధిగా మెగాస్టార్ చిరంజీవి విచ్చేసారు. దీనికి సంబంధించిన పిక్స్ ప్రస్తుతం మీడియాలో వైరల్ అవుతున్నాయి.

[m9ad]

ADVERTISEMENT

ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ – రామ్ చరణ్ లు పక్కపక్కనే నిల్చుని ఉన్న ఫోటోలు, అభిమానులకు ఆనందదాయకంగా మారాయి. ముందుగా షూటింగ్ లో జాయిన్ అయ్యే తారక్, ఇప్పటికే తన గెటప్ ను చేంజ్ చేసుకుని గడ్డంతో, కాస్త ఒళ్ళు చేసి కొత్త గెటప్ లో కనిపిస్తున్నారు.

అలాగే ‘బాహుబలి’ కాంబో ‘ప్రభాస్ – రానా’లు కూడా ఈ వేడుకకు విచ్చేసి సందడి చేసారు. ప్రముఖ దర్శకుడు కొరటాల శివ కూడా విచ్చేసిన ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాను డివివి దానయ్య దాదాపుగా 200 నుండి 300 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నట్లుగా తెలుస్తోంది.

Photos: RRR Movie Launch

ADVERTISEMENT
Latest Stories