ఓ పక్కన రామ్ చరణ్… మరో పక్కన కేటీఆర్..!

Ram Charan and ktr to Launch Kadhali Audio Launchసినిమాలకు, రాజకీయాలకు ఉన్న అవినాభావ సంబంధం తెలియనిది కాదు. ముఖ్యంగా ఈ తరం రాజకీయ నాయకుల రంగప్రవేశంతో ఈ రెండు రంగాల మధ్య ఉన్న సంబంధం మరింత బలపడుతోంది. ప్రస్తుత కాలంలో చాలామంది రాజకీయ నాయకులు సినీ వేడుకలకు హాజరవుతున్న విషయం తెలిసిందే. తాజాగా తెలంగాణా రాష్ట్ర ఐటీశాఖామంత్రివర్యులు కేటీఆర్ కూడా ఓ ఆడియో రిలీజ్ వేడుకకు ముఖ్య అతిధిగా హాజరు కాబోతున్నారు.

ADVERTISEMENT

నిజానికి సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తులతో మంచి సాన్నిహిత్య సంబంధం కలిగిన వ్యక్తిగా కేటీఆర్ నిలుస్తారు. ఏ పెద్ద సినిమా విడుదలైనా, వెంటనే సినిమా చూసి, దానిని సోషల్ మీడియాలో పంచుకోవడం కేటీఆర్ గత కొంతకాలంగా చేస్తున్న రెగ్యులర్ కార్యక్రమాలలో ఒకటి. అయితే ఈ వేడుకకు మరింత స్పెషాలిటీ ఏమిటంటే… కేటీఆర్ తో పాటు మెగా వారసుడు రామ్ చరణ్ కూడా ముఖ్య అతిధిగా హాజరు కాబోతున్నారు.

వీరిద్దరిని కలిపిన ఆ సినిమా ఏది అనుకుంటున్నారా? అదేమీ భారీ బడ్జెట్ తో కూడుకున్న సినిమా కాదు గానీ, “కాదలి” అనే ఓ చిన్న సినిమా ఆడియో విడుదలకు వీరిద్దరూ ముఖ్య అతిధులుగా విచ్చేస్తున్నారు. దీంతో పోస్టర్ లో ఓ వైపు చెర్రీని, మరో వైపు కేటీఆర్ ను ఉంచుతూ చిత్ర యూనిట్ ఓ పోస్టర్ విడుదల చేసింది. రామ్ చరణ్ మాదిరి సినీ హీరో రేంజ్ లో కేటీఆర్ లుక్ ఉండడంతో ఈ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ADVERTISEMENT
Latest Stories