సిద్ధా గా రామ్ చరణ్… మెగా ఫ్యాన్స్ కు ఇంతకన్నా కావాల్సింది ఏముంది?

Ram-Charan - Acharya-Movieమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆచార్య షూటింగ్ ప్రారంభించారు, ఇందులో అతను ఒక కీలకమైన గెస్ట్ రోల్ పోషిస్తున్నాడు అన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో సిద్ధ పాత్రలో నటించబోతున్న రామ్ చరణ్ యొక్క స్నీక్ పిక్ ని విడుదల చేసి మేకర్స్ ఈ సందర్భాన్ని మెగా అభిమానులకు మరింత స్పెషల్ గా మార్చివేశారు.

చరణ్ వెనుక నుండి ఉన్న ఈ ఫొటోలో చెవి స్టడ్ తో, కొంచెం గడ్డం మరియు మెడలో రుద్రాక్ష మాలతో మెగా అభిమానులను పిచ్చెక్కించేలా ఉంది ఫోటో. చరణ్ కాలర్ లేని కుర్తా లాంటి దుస్తులను ధరించినట్లు కనిపిస్తాడు. ఈ చిత్రం రామ్ చరణ్ మొహం కూడా కనిపించకపోయినా సోషల్ మీడియాలో అగ్గి రాజేసింది.

ADVERTISEMENT

ఆచార్య ఈ సమ్మర్‌ కు విడుదల చేయబోతున్నారు. ప్రస్తుత పరిస్థితులను బట్టి ఆర్ఆర్ఆర్ వచ్చే ఏడాది సంక్రాంతికి మాత్రమే విడుదల అవుతుంది, అంటే ఒక సంవత్సరం దూరంలో ఉంది. రామ్‌ చరణ్‌ అభిమానులు తమ అభిమాన హీరోని ఆర్‌ఆర్‌ఆర్‌కు ముందు ఆచార్యలో చూసే అవకాశం దక్కుతుంది. రామ్ చరణ్ చివరి చిత్రం వినయ విధేయ రామ విడుదలై రెండేళ్ళు అయింది. అలాగే, ఆ చిత్రం చరణ్‌కు చేదు అనుభవాన్ని మిగిల్చింది.

పైగా ఆచార్య మినిమమ్ గారంటీ డైరెక్టర్‌గా పేరుపొందిన కొరటాల శివ నుండి వస్తుంది. అన్నింటికంటే మించి, చిరంజీవి మరియు చరణ్ ఈ చిత్రంలో తొలిసారిగా చెప్పుకోదగ్గ పాత్రలలో నటించనున్నారు. చాలా గ్యాప్ తర్వాత వారిని కలిసి చూడటం ఒక ట్రీట్ అవుతుంది. ఒక విధంగా చెప్పాలంటే, ఆచార్య అనేది మెగా అభిమానులకు సరైన సమయంలో జరుగుతున్న మంచి అనే చెప్పుకోవాలి.

ADVERTISEMENT
Latest Stories