వారం రోజుల గ్యాప్ లో ‘మెగా’ హంగామా!

ram charan - boyapati srinu movie first look on august 15thమెగాస్టార్ చిరంజీవి హీరోగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న “సైరా” సినిమా ఫస్ట్ లుక్ ను ఆగష్టు 22వ తేదీన విడుదల చేయనున్న విషయం తెలిసిందే. మెగాస్టార్ పుట్టినరోజు కానుకగా విడుదల కానున్న ఫస్ట్ లుక్ పై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. అయితే అంతకు ఒక వారం రోజులు ముందుగానే మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ తేజ్ తన ఫస్ట్ లుక్ తో మెగా ఫ్యాన్స్ ను అలరించేందుకు సిద్ధమవుతున్నాడు.

అవును… బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ఆగష్టు 15వ తేదీన స్వాతంత్ర్య దినోత్సవం నాడు విడుదల చేయనున్నారని సమాచారం. టైటిల్ తో కూడిన ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోందని తెలుస్తోంది. దీంతో ఒక వారం రోజుల గ్యాప్ లో మెగా కాంపౌండ్ లో రెండు భారీ హంగామాలే చోటు చేసుకోబోతున్నాయి.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories