రాసుకోండి… ఇదో కొత్త టైటిల్..!

Ram Charan Boyapati Srinu Movie Title
బోయపాటి శ్రీను – రామ్ చరణ్ సినిమాకు సంబంధించి ఇప్పటికే బోలెడన్ని టైటిల్స్ వినిపించాయి. సినిమా ప్రారంభమైన తొలినాళ్ళల్లో “రాజసం” నుండి “రౌడీ తమ్ముడు” వరకు ఎన్ని హల్చల్ చేసినా, తాజాగా సందడి చేస్తోన్న టైటిల్ మాత్రం అందరినీ మెప్పించే విధంగా ఉంది. విశేషం ఏమిటంటే… ఈ టైటిల్ లో చెర్రీ పేరు ‘రామ్’ కూడా ఉండడం!

[m9ad]

ADVERTISEMENT

ఈ సినిమాలో రామ్ చరణ్ ను చాలా అగ్రెసివ్ గా చూపించబోతున్న బోయపాటి, టైటిల్ ను మాత్రం సాఫ్ట్ గా పెట్టబోతున్నారని, “వినయ విధేయ రామ్” పేరుతో చిత్ర యూనిట్ ముందుకు రాబోతోందన్నది లేటెస్ట్ న్యూస్. వినయం… విధేయతలకు అర్ధం అందరికీ తెలిసిందే. ఆ టైటిల్ కు, హీరో క్యారెక్టర్ కు సంబంధం లేకుండా సినిమాలో ఫన్ జనరేట్ చేయడమే బోయపాటి మార్క్.

ADVERTISEMENT
Latest Stories