రామ్ చరణ్… బ్యాక్ టు రెగ్యులర్…!

ram-charan-boyapati-srinu--shootingసుకుమార్ సృష్టించిన “రంగస్థలం”లోని ‘సిట్టిబాబు’ పాత్ర కోసం ఆహార్యం, వస్త్రధారణ మార్చిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, ప్రస్తుతం నార్మల్ కు వచ్చేసారు. అంతకుముందు సినిమాలలో ఉన్నట్లుగా యాంగ్రీ యంగ్ మ్యాన్ లుక్ లోనే రామ్ చరణ్ గెటప్ ఉన్నట్లుగా కనపడుతోంది. బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా షూటింగ్ లో ఇటీవల రామ్ చరణ్ కూడా భాగస్వామి అయిన విషయం తెలిసిందే.

హైదరాబాద్ లో జరుగుతోన్న ఈ సినిమా షూటింగ్ కు సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మానిటర్ లో సీరియస్ గా చూస్తున్న రామ్ చరణ్ తో పాటు, పక్కనే బోయపాటి కూడా ఆసక్తిగా మానిటర్ వైపుకు చూస్తున్నాడు. ‘రంగస్థలం’లో కనిపించిన లుక్ కు పూర్తి విరుద్ధంగా ఈ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులకు కనువిందు చేయనున్నాడన్న మాట.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories