బోయపాటి శ్రీను దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తోన్న సినిమాకు సంబంధించిన టైటిల్ పై గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో విస్తృత చర్చ నడుస్తోంది. తొలుత చిరంజీవి సినిమా టైటిల్ “స్టేట్ రౌడీ” అన్న టైటిల్ ను ఖరారు చేసారని హల్చల్ చేసినప్పటికీ, అది మరీ మోటుగా ఉందన్న టాక్ తో, ‘పవర్ స్టార్’ టైటిల్ తెరపైకి వచ్చింది.
[m9ad]
పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ మూవీ ‘తమ్ముడు’ సినిమా పేరును ఫైనల్ చేసారని వస్తోన్న వార్తలు పతాక స్థాయికి చేరుకున్నాయి. అయితే లేటెస్ట్ గా చిరు + పవన్ సినిమాల టైటిల్స్ ను మిక్స్ చేసి, ఈ సినిమాకు టైటిల్ గా పెట్టబోతున్నారన్న ప్రచారం జరుగుతోంది. చిరు ‘స్టేట్ రౌడీ’లో ‘రౌడీ’ని, పవన్ కళ్యాణ్ ‘తమ్ముడు’ టైటిల్ ను కలిపి ‘రౌడీ తమ్ముడు’గా రామ్ చరణ్ రాబోతున్నారని సోషల్ మీడియాలో హంగామా జరుగుతోంది.
అయితే దీనిపై కూడా నెటిజన్లు వినూత్నమైన కామెంట్స్ చేస్తున్నారు. బహుశా ఈ టైటిల్ మెగా ఫ్యాన్స్ ను ఖుషీ చేస్తుందేమో గానీ, తమిళ సినిమా డబ్బింగ్ టైటిల్ మాదిరి ఉందన్న టాక్ ఎక్కువగా వినపడుతోంది. అయితే మరికొద్ది రోజుల్లోనే టైటిల్ పై నెలకొన్న సందేహాలకు చిత్ర యూనిట్ బదులిచ్చే అవకాశం స్పష్టంగా ఉంది. వచ్చే వారంలో టైటిల్ ను, దసరాకు ఫస్ట్ టీజర్ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లుగా సమాచారం.



