రాజమౌళి “మగధీర” సినిమాలో హార్స్ రైడింగ్ తో ఆల్ టైం ఇండస్ట్రీ రికార్డులు తన వశం చేసుకున్న రామ్ చరణ్ మళ్ళీ గుర్రమెక్కారు. అయితే ఈ సారి రికార్డులు బద్దలు కొట్టడం కోసం కాదు, తన వర్కౌట్స్ లో భాగంగా బెంగుళూరులో గుర్రంపై స్వారీ చేస్తూ కనపడ్డారు. ప్రస్తుతం ఈ ఫోటోలను షేర్ చేసుకుంటూ మెగా అభిమానులు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు.
తండ్రి మెగాస్టార్ చిరంజీవి మాదిరే చెర్రీ కూడా గుర్రపు స్వారీ అద్భుతంగా చేయగలరన్న విషయం తెలిసిందే. ‘మగధీర, తుఫాన్’ చిత్రాలలో చెర్రీ స్వారీ చేస్తూ అభిమానులను ‘రీల్’ లైఫ్ లో అబ్బూర పరచగా, ఇప్పుడు రియల్ లైఫ్ లోని ఫోటోలతో ఆకట్టుకుంటున్నారు.
ADVERTISEMENT
ADVERTISEMENT





