రాజమౌళి దర్శకత్వంలో టాలీవుడ్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ గా తెరకెక్కుతోన్న సినిమా షూటింగ్ మొదలైంది. ఈ విషయాన్ని ఖరారు చేస్తూ దర్శకదిగ్గజం రాజమౌళి ఓ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. ఓ పక్క రామ్ చరణ్… మరో పక్కన ఎన్టీఆర్… నడుమ రాజమౌళి ఉన్న దృశ్యం సినీ ప్రేక్షకులకు పండగలా మారింది.
ADVERTISEMENT
[m9ad]
జక్కన్న పోస్ట్ చేసిన క్షణాల్లోనే ఈ పిక్ వైరల్ గా మారి నెట్టింట సందడి చేస్తోంది. తొలుత జూనియర్ ఎన్టీఆర్ తో షూటింగ్ మొదలుపెట్టి, తర్వాత రామ్ చరణ్ జాయిన్ అవుతారని ప్రచారం జరిగినప్పటికీ, ఇటీవల జరిగిన చిత్ర ప్రారంభోత్సవం సందర్భంగా షూటింగ్ పై స్పష్టత వచ్చింది. దీంతో ఇరువురు హీరోల అభిమానులు ఫుల్ హ్యాపీస్.
ADVERTISEMENT



