మరో ‘శ్రీమంతుడు’ సెట్ అవుతుందా?

Ram charan next movie with Koratala Sivaకారణాలు ఏవైనా గానీ పూజా కార్యక్రమాలు జరుపుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – కొరటాల శివ కాంభినేషన్ లోని సినిమా ఆగిపోయింది. దాని తర్వాత కొరటాల – ప్రిన్స్ జోడిగా ‘శ్రీమంతుడు’ మూవీ విడుదలై, ఆల్ టైం రికార్డులను సృష్టించింది. దీంతో చెర్రీ ఒక సూపర్ హిట్ సినిమాను వదిలేసుకున్నాడని సర్వత్రా చర్చ జరిగింది. అయితే తాను చెర్రీకి చెప్పింది ‘శ్రీమంతుడు’ కధ కాదు, వేరేది అని కొరటాల చెప్పినప్పటికీ, చెర్రీ వదులుకున్నది ‘శ్రీమంతుడు’ కధే అన్న బలమైన టాక్ ట్రేడ్ వర్గాలలో ఉంది.

ADVERTISEMENT

ఆ తర్వాత కొరటాల ‘జనతా గ్యారేజ్’ చేయడం, మళ్ళీ ప్రస్తుతం మహేష్ బాబుతో “భరత్ అనే నేను” సినిమాకు శ్రీకారం చుట్టడం జరిగిపోయాయి. ప్రస్తుతం సెట్స్ పైన ఉన్న ఈ సినిమా 2018 సంక్రాంతి సమయానికి గానీ, సమ్మర్ కు గానీ సిద్ధమవుతోంది. అయితే దీని తర్వాత మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ తో జత కడతారని భావించినప్పటికీ, వాటన్నింటిని పటాపంచలు చేస్తూ… రామ్ చరణ్ – కొరటాల కాంభినేషన్ లో సినిమా ఉండబోతుందని కొణిదల ప్రొడక్షన్స్ నుండి ఓ అధికారిక ప్రకటన వెలువడింది.

2018 సమ్మర్ లో ప్రారంభం కాబోతున్న ఈ సినిమాను కొణిదల ప్రొడక్షన్స్ తో పాటు మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్స్ సంస్థ కలిసి నిర్మించనుంది. ఇక ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న “రంగస్థలం 1985” సినిమా కూడా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది. కొరటాల శివ దర్శకత్వంలో ‘శ్రీమంతుడు’ సినిమాను మిస్ చేసుకున్న చెర్రీ, అంతకుమించిన కధతో, దానికి మించిన బ్లాక్ బస్టర్ విజయంతో ప్రేక్షకుల ముందుకు వస్తారో లేదో చూడాలి.

ADVERTISEMENT
Latest Stories