మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్..దుమ్ము రేపుతున్నాడు…ఒక్క చోటే ఉండిపోతే ఎలా అనుకున్నాడో ఏమో కానీ…మనకు పక్కనే ఉన్న కేరళ మల్లు వుడ్…అదే అండీ మన కోలీవుడ్ లో కూడా తన స్టామినాని చూపించేందుకు రంగం సిద్ధం చేస్తున్నాడు..
[m9ad]
ఇప్పటికే అ(మ)ల్లు అర్జున్ అక్కడ తన జెండా పాతగా…ఈ మధ్యే ఎన్ఠీఆర్ కూడా తన టాలెంట్ ను మల్లూకి పరిచయం చేసాడు..కట్ చేస్తే ఇప్పుడు రామ్ చరణ్ ఒక పక్క సంక్రాంతికి తెలుగులో వినయ విధేయ రామతో తెలుగు వారిని పలకరించనుండగా…మరో పక్క వారం రోజుల తర్వాత జనవరి 18 న రంగస్థలం సినిమా మలయాళం వెర్షన్ రిలీజ్ కానుంది…
అంతే కాకుండా వేను వెంటనే వినయ విధేయ రామ కూడా జనవరి 25 న రిపబ్లిక్ డే సందర్భంగా మలయాళంలో విడుదల కానుంది. మొత్తంగా చూసుకుంటే ఇటు తెలుగులో తన టాలెంట్ తో మెగా పవర్ స్టార్ గా కీర్తి గడించిన చెర్రీ…మలయాళంలో కూడా తన ప్రస్థానాన్ని కొనసాగించాలి అని గట్టిగానే ప్రయత్నిస్తున్నాడు..
మరి ఈ ప్రయత్నం ఈమేరకు సక్సెస్ అవుతుందో చూద్దాం.



