రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ మోడ్ ఆన్

Ram Charan - RRR Movieకరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా వచ్చిన తన దీర్ఘకాల సెలవును మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ ముగించినట్లు తెలుస్తోంది. అక్టోబర్ 5 నుండి ఆర్‌ఆర్‌ఆర్ షూటింగ్ తిరిగి ప్రారంభం అవుతుందని వార్తలు వస్తున్నాయి. ఆ వార్తలకు మద్దతుగా రామ్ చరణ్ చాలా గ్యాప్ తర్వాత జిమ్‌ కు వెళ్లడం ప్రారంభించాడు.

ADVERTISEMENT

బహుశా, ఇది షూట్ కోసం ఒక సన్నాహకాలలో భాగం కావొచ్చు. ఎన్టీఆర్, రామ్ చరణ్ నటించిన ఈ చిత్రం సంక్రాంతి 2020 కి విడుదల కావాల్సి ఉంది, కాని కరోనా కారణంగా అది నిరవధికంగా వాయిదా పడింది. వచ్చే ఏడాది మార్చి.. ఏప్రిల్ నాటికి షూట్ పూర్తి చేసి రామ్ చరణ్, ఎన్టీఆర్లను ఈ సినిమా నుండి రిలీవ్ చెయ్యాలని ప్రణాళిక.

ప్రస్తుత ఉన్న పరిస్థితుల బట్టి ఈ చిత్రం 2021 రెండవ భాగంలో విడుదల అవుతుంది. అల్లూరి సీతా రామరాజు మరియు కొమరం భీమ్ అనే ఇద్దరు లెజెండరీ ఫ్రీడమ్ ఫైటర్స్ ఆధారంగా ఆర్ఆర్ఆర్ ఒక కల్పిత కథ. వారి వారి పోరాటాలకు ముందు ఢిల్లీలో కలిసినప్పుడు ఏమి జరుగుతుందో ఈ చిత్రం.

రామ్ చరణ్ అల్లూరి పాత్రలో, ఎన్టీఆర్ తెలంగాణ వారియర్ పాత్రలో నటించనున్నారు. ఇప్పటికే రామ్ చరణ్ పాత్రకు సంబంధించిన టీజర్ విడుదలై సూపర్ రెస్పాన్స్ రాబట్టింది. ఎన్టీఆర్ టీజర్ కూడా విడుదల కావాల్సి ఉన్నా, లాక్ డౌన్ కారణంగా కుదరలేదు. రామ్ చరణ్ సరసన బాలీవుడ్ భామ ఆలియా భట్ హీరోయిన్ గా నటిస్తుంది.

ADVERTISEMENT
Latest Stories