చిన్న హాలిడేకి చెక్కేసిన రామ్ చరణ్

ram-charan-rrrమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ లో తన పార్టు షూటింగ్ పనిలో ఉన్నారు. అయితే సంక్రాంతి కావడంతో చిత్ర యూనిట్ చిన్న బ్రేక్ తీసుకుంది. ఈ గ్యాప్ లో రామ్ చరణ్, భార్య ఉపాసనతో కలిసి సింగపూర్ బయల్దేరారు. నాలుగైదు రోజులలో ఆయన తిరిగి హైదరాబాద్ వస్తారు. ఫిబ్రవరి చివరి నాటికి ఆయన ఆర్ఆర్ఆర్ షూటింగ్ పూర్తి చేసే అవకాశం ఉంది.

రామ్ చరణ్ మెగా స్టార్ చిరంజీవి నటిస్తున్న కొరటాల శివ చిత్రంలో చిన్న పాత్ర చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ పూర్తయిన తరువాత ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేస్తారు. ఆ తరువాత తన తదుపరి చిత్రంపై ఒక నిర్ణయం తీసుకుంటారు. వచ్చే రెండు సంవత్సరాలలో మూడు సినిమాలు చెయ్యాలని రామ్ చరణ్ టార్గెట్ గా పెట్టుకున్నట్టు సమాచారం.

ADVERTISEMENT

ఆర్ఆర్ఆర్ లో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు మరియు ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియాభట్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఎన్టీఆర్ సరసన ఒక హాలీవుడ్ తార కనిపించబోతుంది. దాదాపుగా 400 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నాడు డీవీవీ దానయ్య.

బాహుబలి తరువాత వచ్చే సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే వాటికి ఏమాత్రం తగ్గదని చిత్ర బృందం అంటుంది. బాలీవుడ్ స్టార్స్ – అజయ్ దేవగన్, అలియా భట్ చిత్రబృందాన్ని కలవాల్సి ఉంది. వచ్చే షెడ్యూల్ లో వారు ఎంటర్ అయ్యే అవకాశం ఉంది. సాధ్యమైనంత వరకూ జులై 30నే సినిమాను విడుదల చెయ్యడానికి చిత్రబృందం ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం.

ADVERTISEMENT
Latest Stories