చరణ్‌ మైండ్‌ బ్లాంక్‌ అయ్యింది!!

Ram-Charan- shruthi haasanమెగా హీరో రామ్‌చరణ్‌ సరసన నటించేందుకు ఏ హీరోయిన్‌ అయినా ఆసక్తి చూపుతుంది. ఈయనతో నటిస్తే తమ కెరీర్‌ టర్న్‌ అవుతుందనే ఉద్దేశ్యంతో హీరోయిన్స్‌ చరణ్‌ సినిమాలో నటించే అవకాశం కోసం ఎదురు చూస్తుంటారు. అలాంటి అవకాశం వస్తే వదులుకునే వారు ఉండరు. కాని శృతిహాసన్‌ మెగా ఆఫర్‌ను వదులుకుని అందరికి తాను భిన్నం అంటూ మరో సారి నిరూపించుకుంది. చరణ్‌ సరసన ‘ఎవడు’ చిత్రంలో నటించి సక్సెస్‌ను దక్కించుకున్న శృతిహాసన్‌కు మరో మెగా ఆఫర్‌ వచ్చింది.

తమిళ సూపర్‌ హిట్‌ చిత్రం ‘తని వరువన్‌’ రీమేక్‌లో చరణ్‌కు జోడీగా శృతిహాసన్‌ను ఎంపిక చేయాలని నిర్మాత అల్లు అరవింద్‌ మరియు దర్శకుడు సురేందర్‌ రెడ్డి భావించారు. అందుకోసం శృతిహాసన్‌ను వీరిద్దరు సంప్రదించారు. అప్పుడే వారిద్దరికి షాక్‌ ఇచ్చేలా తాను ఆ సినిమాలో నటించలేను అంటూ చెప్పిందట. దాంతో చరణ్‌ కూడా అవాక్కయ్యాడని చెబుతున్నారు. ప్రస్తుతం పలు చిత్రాల్లో నటిస్తున్న తాను చరణ్‌ సినిమాకు డేట్లు ఇవ్వలేను అంటూ శృతి తేల్చి చెప్పిందట. అయితే విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం తమిళంలో నయనతార చేసిన పాత్రను చేయడం ఇష్టం లేక పోవడం వల్లే శృతిహాసన్‌ ఆ రీమేక్‌కు నో చెప్పినట్లుగా తెలుస్తోంది. మరో వైపు ఈమెను ఎన్టీఆర్‌, కొరటాల శివల ‘జనతా గ్యారేజీ’ చిత్రంలో హీరోయిన్‌గా ఎంపిక చేశారు. నాగచైతన్య హీరోగా నటించబోతున్న ‘ప్రేమమ్‌’ రీమేక్‌లో కూడా శృతిహాసన్‌ నటిస్తోంది.

ADVERTISEMENT
Latest Stories