రామ్ చరణ్ ‘బ్రూస్‌లీ’ చిత్రం తర్వాత తమిళ చిత్రం ‘తను వరువన్’ రీమేక్‌లో నటించబోతున్న విషయం తెల్సిందే. తాజాగా విడుదలైన ‘బ్రూస్‌లీ’ చిత్రం తీవ్రంగా నిరాశ పర్చింది. ఆ సినిమా ప్రభావం ఈ రీమేక్‌పై పడ్డట్లుగా అనిపిస్తోంది. ‘బ్రూస్‌లీ’ని నిర్మించిన దానయ్య చరణ్‌తో ‘తను వరువన్’ రీమేక్ చేయాలని భావించాడు. అందుకోసం భారీ మొత్తం పెట్టి రీమేక్ రైట్స్‌ను సైతం దక్కించుకున్నాడు. అయితే ‘బ్రూస్‌లీ’ ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేయడంతో సినిమా నిర్మాణం తన వల్ల కాదు అని తప్పుకున్నట్లుగా తెలుస్తోంది.
దానయ్య వదిలేసిన ఈ రీమేక్‌ను మెగా నిర్మాత అల్లు అరవింద్ చేపట్టినట్లుగా తెలుస్తోంది. అల్లు అరవింద్ ప్రస్తుతం బన్నీతో ‘సరైనోడు’ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. త్వరలో ఈ సినిమాను కూడా ప్రారంభించబోతున్నాడు. ఇక ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించబోతున్నాడు. ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ తక్కువ బడ్జెట్‌తో నిర్మించాలని భావిస్తున్నాడు. ‘కిక్ 2’తో దర్శకుడు సురేందర్ రెడ్డి ఫ్లాప్ అయ్యాడు. ‘బ్రూస్‌లీ’తో చరణ్ దెబ్బ తిన్నాడు. దాంతో ‘తను వరువన్’ రీమేక్‌కు అంత క్రేజ్ ఉండే అవకాశం లేదని, అందుకే తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కించడం మంచిది అని అల్లు అరవింద్ భావిస్తున్నాడు. వచ్చే నెలలో ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతుంది.





