హీరోయిన్లపై వివాదాల దర్శకుడి అనుభూతులు ఇవి!

ram gopal varma controversy comments on heroinesవివాదానికి మరో పేరు ఉంటే అది రాంగోపాల్ వర్మ అయ్యుటుందన్న మాట అందరి దగ్గరి నుండి వచ్చేదే. తన సినిమాల హీరోయిన్ల గురించి సంచలన ప్రకటనలు చేసే దర్శకుడు రాంగోపాల్ వర్మ, వాళ్లతో ఉన్న అనుబంధంపై తన అభిప్రాయాలను వ్యక్తపరుస్తూ ఏకంగా ఒక బుక్ రాశారు. ఆ పుస్తకానికి ‘గన్స్ అండ్ థైస్’ అని నామకరణం కూడా చేసిన సంగతి తెలిసిందే. ఈ పుస్తకంలోని ‘ఉమెన్ ఇన్ మై లైఫ్’ అనే చాప్టర్‌లో బ్యూటీలతో తనకున్న సంబంధాలను బయటపెట్టారు.

ఈ పుస్తకంలో మొదటి పేరు ఎవరుంటారన్నది ఊహించదగ్గ పరిణామమే. “అతిలోకసుందరి”గా పేర్కొనే శ్రీదేవి అందానికి తను ఎలా పడిపోయిందీ, ఆమెతో ‘క్షణక్షణం’ సినిమా చేసినప్పటి అనుభూతులు గురించి విపులంగా రాసుకొచ్చారు వర్మ. అంతేకాదు, ఆమెను కలిసిన తరువాత ఫాంటసీ, రియాల్టీ‌కి తేడా తెలిసిందని ప్రస్తావించాడు.

ADVERTISEMENT

బాలీవుడ్ నటి ఊర్మిళ తనలో నటుడ్ని నిద్రలేపిందనీ, ‘రంగీలా’లో ఆమె అందాన్ని ప్రతి ఫ్రేమ్‌లో బంధించాననీ చెప్పుకొచ్చాడు. ఊర్మిళ ఫేసు, ఫిగరూ కూడా మైండ్ బ్లాక్ అయిపోతుందనీ తెగ పొగిడేశాడు. ఊర్మిళ తరువాత వర్మ తెగ మనసుపడ్డ హీరోయిన్ ఆంత్రామాలి. ‘మస్త్’ షూటింగ్‌లో ఈమె యాక్టింగ్ చూసి ‘కంపెనీ’ సినిమాలో కూడా కంటిన్యూ చేశానన్నాడు. హీరోయిన్లు అందరూ బాగానే ఉంటారనీ, కానీ ఫ్రేమ్‌లో ఫిక్స్ చేసే విషయంలోనే సమస్యలొస్తాయని మనసులోని మాట బయటపెట్టాడు.

ADVERTISEMENT
Latest Stories