ఈ ట్రైలర్ తో పెద్దగా ఉపయోగం లేదబ్బాయ్!

RGV  Officer Trailer Talkకింగ్ నాగార్జున హీరోగా రాంగోపాల్ వర్మ దర్శకత్వం వహించిన “ఆఫీసర్” చిత్రం నుండి ఇప్పటికి రెండు టీజర్లు విడుదల కాగా, తాజాగా ధియేటిరికల్ ట్రైలర్ ను రిలీజ్ చేసారు. రెండు టీజర్ల వలన పెరగని అంచనాలు ఈ ట్రైలర్ తో పెరిగాయా? అంటే దానికి సమాధానం లభించడం కష్టమే. ట్రైలర్ నిండా వర్మ మార్క్ యాక్షన్ సన్నివేశాలు నింపేయడంతో, ఇది పక్కా యాక్షన్ ఎంటర్టైనర్ అని స్పష్టం చేసారు.

ADVERTISEMENT

ఓ పక్కన కూతురుతో సెంటిమెంట్ ను పండిస్తూ… మరో పక్కన దుష్ట శక్తులను అంతరించే పోలీస్ ఆఫీసర్ గా నాగార్జున కనిపించబోతున్నారు. అయితే ట్రైలర్ లో చూపించిన గన్ సౌండ్స్ ను భరించడమే కాస్త కష్టంగా ఉన్న నేపధ్యంలో… సిల్వర్ స్క్రీన్ పై ఎలాంటి అనుభూతులను పంచుతుందో తెలియాలంటే ఈ నెలాఖరు వరకు వేచిచూడాల్సిందే. శ్రీరెడ్డి వ్యవహారంలో వర్మ జోక్యంతో ఈ సినిమాకు తెలుగు ప్రేక్షకుల నుండి ఎలాంటి ఆదరణ లభిస్తుందో చూడాలి.

ADVERTISEMENT
Latest Stories