అయ్య బాబోయ్… మళ్ళీ కెలికేస్తున్నాడు..!

Ram Gopal Varma sattire on YS Jagan Tollywood starsఒక విషయాన్ని ఎంత రచ్చ చేయాలో రాంగోపాల్ వర్మకు తెలిసినట్లుగా మరొకరికి తెలియదు. అలాగే ఎప్పుడు ఎవరి వైపున ఎలా మాట్లాడతారో కూడా తెలియని విధంగా తన ట్వీట్లతో ఒక్కోసారి నెటిజన్లకు పిచ్చెక్కిస్తుంటారు. ఆ క్రమంలోనే తాడేపల్లి జగన్ నివాసం ఉదంతాన్ని ప్రస్తావిస్తూ తాజాగా ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు.

సూపర్, మెగా, బాహుబలి స్టార్స్ కంటే వైఎస్ జగన్ మరియు పేర్ని నానిలు అతి పెద్ద స్టార్లుగా అవతరించారని, ఈ విషయం చెప్పడానికి నేను ఒక ట్వీట్ వేయడానికి ఏ మాత్రం సందేహించడం లేదని, ఒమెగాస్టార్ వైఎస్ జగన్ చుట్టూ మహేష్, చిరు, ప్రభాస్ లు జూనియర్ ఆర్టిస్ట్ ల మాదిరి కూర్చున్నారని ఎటకారపు ట్వీట్లతో వోడ్కా టైములో మాంచి జోరుమీదున్నారు.

ADVERTISEMENT

రీల్ జీవితంలో మహేష్, చిరు, ప్రభాస్ లు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఉంటారని, కానీ ఇక్కడ నిజజీవితంలో వైఎస్ జగన్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా కనపడుతున్నారని, జూనియర్ ఆర్టిస్ట్ ల మాదిరి భిక్ష అడుక్కోవడానికి వాళ్లంతా బాగా భయపడుతున్నారని, జగన్ ద్వారా స్టార్ హీరోల ఎత్తుపల్లాలు తెలిసాయని అన్న వర్మ ‘హీరోస్ ఆర్ జీరోస్’ అంటూ సూపర్ మెగా స్టార్స్ ను కీర్తించారు.

అయితే ఈ విషయంపై అసలు వర్మ స్పందించడానికి కారణం… త్వరలోనే తాను దర్శకత్వం వహించిన మొదటి ఇండియన్ లెస్బియన్ మూవీ “ఖత్రా డేంజరస్” విడుదలకు సిద్ధంగా ఉండడమే. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ లో నైనా గంగూలీ – అప్సర రాణిల నడుమ హాట్ హాట్ సన్నివేశాలను జోడించినప్పటికీ ఆశించిన పబ్లిసిటీ దక్కకపోవడంతో, తన రొటీన్ మార్గాన్ని ఎంచుకున్నారు వర్మ.

ADVERTISEMENT
Latest Stories