‘నేను శైలజ’ రెడీ

ram next movie nenu sailajaఇటీవలే ‘శివమ్‌’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఫ్లాప్‌ను చవి చూసిన ఎనర్జిటిక్‌ హీరో రామ్‌ త్వరలో ‘నేను శైలజ’ చిత్రంతో వచ్చేందుకు సిద్దం అవుతున్నాడు. మొదట ఈ సినిమాకు ‘హరికథ’ అనే టైటిల్‌ను అనుకున్నారు. అయితే కథకు ఆ టైటిల్‌ సరిగా సూట్‌ అవ్వడంలేదనే ఉద్దేశ్యంతో వైవిధ్యంగా ఉండాలనే ఉద్దేశ్యంతో ‘నేను శైలజ’ అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేశారు. ఈ సినిమా షూటింగ్‌ పూర్తి అయినట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు అధికారికంగా ప్రకటించారు.

ప్రస్తుతం సినిమాకు సంబంధించిన పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ను జరుపుతున్నట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. ఈ సినిమాపై రామ్‌ చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఈ సినిమాకు కిషోర్‌ తిరుమల దర్శకత్వం వహించగా, స్రవంతి రవికిషోర్‌ నిర్మించాడు. ఈ సినిమాతో తమిళ స్టార్‌ హీరోయిన్‌ కీర్తి సురేష్‌ తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతుంది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి ఈ సినిమాను కొత్త సంవత్సరం కానుకగా జనవరి 1న విడుదల చేయాలని నిర్మాత స్రవంతి రవికిషోర్‌ ఏర్పాట్లు చేస్తున్నాడు. ఈ సినిమా సక్సెస్‌ రామ్‌కు చాలా అవసరం. వరుసగా ఫ్లాప్‌లతో తల బొప్పి కట్టిన రామ్‌ ఈ సినిమా సక్సెస్‌ అవుతుందని ఆశతో ఎదురు చూస్తున్నాడు.

ADVERTISEMENT
Latest Stories