రామ్ డిఫరెంట్ ఛాయిస్ కానీ డౌట్ ఫుల్

Sam CS joins Ram Pothineni film

రామ్ తన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న సినిమా కోసం కొన్ని డిఫరెంట్ ఛాయిస్ లు తీసుకుంటున్నాడు. హీరోయిన్ విషయంలో ఇంకా క్లారిటీ తీసుకోలేకపోతున్నాడు కానీ.. టెక్నీషియన్స్ విషయంలో మాత్రం చాలా ప్లాన్డ్ గా వ్యవహరిస్తున్నాడు.

ఆల్రెడీ సినిమాటోగ్రాఫర్ గా తిరుని తీసుకుని విజువల్స్ విషయంలో ఎంత పక్కాగా ఉన్నాడో తెలియజెప్పాడు. ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ గా సామ్ సి.ఎస్ ను #RAPO23 ప్రపంచంలోకి ఇన్వైట్ చేసాడు. “ఖైదీ” సినిమాతో సామ్ సీఎస్ సంగీతానికి క్రేజ్ వచ్చింది. అనంతరం తెలుగులో చాలా సినిమాలు చేసాడు కానీ.. పెద్దగా వర్కవుట్ అవ్వలేదు. ముఖ్యంగా “రామారావు ఆన్ డ్యూటీ, మోసగాళ్లు, నోటా, దిల్ రూబా, జాక్, మైఖేల్” లాంటి సినిమాలకు సామ్ అందించిన సంగీతం వర్కవుట్ అవ్వలేదు.

ADVERTISEMENT

అయితే తమిళంలో మాత్రం సామ్ బీజియంకి మంచి ఫ్యాన్ బేస్ ఉంది. అందుకే “పుష్ప 2” నేపథ్య సంగీతం కోసం సామ్ ను ఏరికోరి తెచ్చుకున్నారు. ఇప్పుడు రామ్ సినిమాకి సామ్ సంగీతం అందించడం అనేది ఒక రకంగా డిఫరెంట్ ఛాయిస్ అయినప్పటికీ.. ఎంతవరకు కరెక్ట్ అనేది చూడాలి.

రామ్ మునుపటి సినిమా “ఆంధ్రా కింగ్ తాలూక” విషయంలోనూ రామ్ ఇదే తరహా ప్రయత్నం చేసాడు. వివేక్-మెర్విన్ ద్వయంతో వర్క్ చేశాడు. పాటలకి మంచి రెస్పాన్స్ వచ్చినా.. అవ్వాల్సినంతగా ట్రెండ్ అవ్వలేదు. మరి తన సినిమాతో చేసే ఈ ప్రయోగం వర్క్ అవుతుందా లేదా అనేది చూద్దాం.

ADVERTISEMENT
Latest Stories