ఇస్మార్ట్ శంకర్ గా రామ్

ram pothineni Ismart shankarఎనర్జిటిక్ హీరో రామ్ పూరి జగన్నాధ్ కంబినేషన్ లో కొత్త సినిమా రాబోతుంది. దీనికి ఇస్మార్ట్ శంకర్ గా నామకరణం చేశారు. కాసేపటి క్రితం సినిమా టైటిల్ ను ప్రకటించి సినిమా మోషన్ పోస్టర్ ను విడుదల చేశారు. ఫక్తు పూరి జగన్నాధ్ హీరోగా రామ్ మోషన్ పోస్టర్ లో కన్పించారు. ఈ చిత్రం షూటింగు ఈ నెలలోనే మొదలు కాబోతుంది. నాలుగే నెలల్లో పూర్తి చేసి మే లో వేసవి కానుకగా సినిమాను విడుదల చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు ఈ చిత్రం యూనిట్.

[m9ad]

ADVERTISEMENT

డబల్ సిమ్ కార్డు అనే టాగ్ లైన్ తో వస్తున్న ఈ చిత్రంపై రామ్, పూరి జగన్నాధ్ భారీ ఆశలే పెట్టుకున్నారు. గత కొద్ది సంవత్సరాలుగా పూరి ప్లాపుల మీద ప్లాపులు ఇస్తున్నాడు… రామ్ కెరీర్ కూడా పెద్దగా ఆశాజనకంగా ఏమీ లేదు. ఎప్పుడో ఒక యావేరేజ్ సినిమా తప్ప పెద్దగా చెప్పుకోదగ్గ హిట్లు ఏమీ లేవు. దీనితో ఈ సినిమాపై వారిద్దరి భవిష్యత్తు ఆధారపడి ఉంది. గత కొద్ది కాలంగా పూరి క్యాంపులో ఉంటూ అతని సినిమాలకు పని చేస్తున్న ఛార్మి ఈ సినిమా పూర్తి బాధ్యతలు చూడబోతుందట.

సినిమా నిర్మాణం నుండి పబ్లిసిటీ వరకు అంతా తానే అయ్యి వ్యవహరిస్తుందని సమాచారం. ఈ చిత్రంలో లుక్ కోసం రామ్ ఇప్పటికే జిమ్ లో కష్టపడుతున్నాడు. పూరి జగన్నాధ్ ఈ సినిమాను తన సొంత బ్యానర్ పూరి జగన్నాధ్ టూరింగ్ టాకీస్ మీద నిర్మాణం చేస్తున్నారు. దీనితో ఆయనకు బాధ్యత రిస్క్ రెండూ ఎక్కువే. ఈ చిత్రంలోని హీరోయిన్, మిగతా నటులు, సాంకేతిక నిపుణుల వివరాలు ప్రకటించాల్సి ఉంది. కొంత మంది కొత్త నటీనటులు కూడా ఈ చిత్రంలో కన్పించనుండడం గమనార్హం.

ADVERTISEMENT
Latest Stories