రామ్‌ ఫిక్స్‌ అయ్యాడు

ram pothineni nenu sailajaఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌ తాజా చిత్రం ‘నేను శైలజ’. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను తాజాగా విడుదల చేయడం జరిగింది. చాలా కూల్‌గా ఉన్న ఫస్ట్‌లుక్‌ సినిమాపై ఒక అంచనాను ఏర్పాటు చేసింది. దాంతో ప్రేక్షకులు మరియు సినీ వర్గాల వారు సినిమా ఎప్పుడు వస్తుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాకు ముందు వచ్చిన రామ్‌ ‘శివమ్‌’ సినిమా డిజాస్టర్‌ అవ్వడంతో ఈ సినిమాపైనే చాలా నమ్మకం పెట్టుకున్నాడు. ఈ సినిమా సక్సెస్‌ కోసం చాలా సెంటిమెంట్స్‌ను రామ్‌ ఫాలో అవుతున్నాడు. ఇక ఈ సినిమా ఆడియోను ఈనెల 12న విడుదల చేయడంతో పాటు సినిమా విడుదల తేదీని సైతం అధికారికంగా ప్రకటించారు.

ఈ సినిమాను కొత్త సంవత్సరం కానుకగా జనవరి 1న విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. కొత్త సంవత్సరంలో రామ్‌ తనకు సక్సెస్‌ దక్కుతుందనే నమ్మకంతో ఉన్నాడు. కీర్తి సురేష్‌ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకు కిషోర్‌ తిరుమల దర్శకత్వం వహించాడు. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత స్రవంతి మూవీస్‌లో తెరకెక్కించడం జరిగింది. ఈ సినిమా కథ నిజ జీవిత కథ ఆధారంగా రూపొందించినట్లుగా సమాచారం అందుతోంది. ఒక క్యూట్‌ లవ్‌ స్టోరీతో ఈ సినిమా నడుస్తుందని దర్శకుడు చెబుతున్నాడు. మరి ఈ సినిమా రామ్‌కు మునుపటి క్రేజ్‌ను తెచ్చి పెడుతుందో చూడాలి.

ADVERTISEMENT
Latest Stories