నచ్చడం కాదు… అదిరిపోయిద్ది : భళ్ళాలదేవుడు మాట!

Rana Daggubati twets on Keshava trailerవినూత్నమైన కధలను ఎంచుకుని సినిమాలు చేస్తున్న యువహీరో నిఖిల్ ఖాతాలో మరో హిట్ పడిపోయినట్లేనని సినీ సెలబ్రిటీలందరూ సోషల్ మీడియా వేదికగా మారుమ్రోగిస్తున్నారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు… సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే టాలీవుడ్ సినీ సెలబ్రిటీలందరూ “అదిరిపోయింది” అన్న ఒక్క నినాదాన్ని పలుకుతున్నారు. తప్పులేదు… నిజానికి నిఖిల్ నటించిన తాజా చిత్రం “కేశవ” ట్రైలర్ చూస్తే ఎవరైనా ఇదే అనాల్సిందే..! మన సెలబ్రిటీలు కూడా అదే అంటున్నారు..!

అయితే అందరూ చెప్పింది వేరు… ప్రస్తుతం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూల్ చేస్తున్న “బాహుబలి 2”లో భళ్ళాలదేవుడుగా నటించిన రానా చెప్పింది వేరు..! ఈ ట్రైలర్ చూసి నచ్చితే మీరు షేర్ చేయండి అంటూ నిఖిల్ సోషల్ మీడియాలో పెట్టిన ట్వీట్ కు, ఒక సాధారణ ప్రేక్షకుడు మాదిరి… “నచ్చడం కాదు, అదిరిపోద్ది” అంటూ రానా ఇచ్చిన రిప్లై ప్రత్యేకతను నిఖిల్ కూడా గుర్తించాడు. ‘మాటలు రావడం లేదు, ప్రస్తుతం మ్యాన్ ఆఫ్ ది మూమెంట్ అయిన భళ్ళాలదేవే ఆశ్చర్యపడేలా ట్రైలర్ ఉందంటే… చాలా హ్యాపీగా ఉన్నాను’ అంటూ స్పందించాడు నిఖిల్.

ADVERTISEMENT

ఇక, నిఖిల్ కు అభినందనలు తెలిపిన జాబితాలో మెగా హీరో సాయిధరమ్ తేజ్, నితిన్, వరుణ్ సందేశ్, సచిన్, అల్లరి నరేష్ అండ్ కో ఉన్నారు. ఇంతమంది సెలబ్రిటీల అభిమానం చూరగొన్న ఈ ట్రైలర్ టాక్ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది! అయితే ట్రైలర్ నిడివి మాత్రం గమనించదగ్గ విషయంగా మారింది. సాధారణంగా ధియేటిరికల్ ట్రైలర్ అంటే రెండు, రెండున్నర్ర నిముషాల పాటు సాగదీయడం అనేది ఇటీవల ‘మిస్టర్’ ట్రైలర్ ద్వారా స్పష్టమైంది. కానీ ‘కేశవ’ మాత్రం ట్రెండ్ కు విరుద్ధంగా నిముషంన్నర్ర లోపే ముగించేయడం చెప్పుకోదగ్గ విషయం.

ADVERTISEMENT
Latest Stories