అవును… డ్రగ్స్ తీసుకున్నానని ఒప్పుకున్న హీరో..!

Ranbir Kapoor Drugs Rockstarటాలీవుడ్ ను డ్రగ్స్ ప్రకంపనలు కుదిపేస్తున్న విషయం తెలిసిందే. ఈ నెల 19 నుండి 27వ తేదీ వరకు రకరకాల తేదీలలో సెలబ్రిటీలు అధికారుల ముందు హాజరవుతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటివరకు ఎవరు కూడా తమపై వచ్చిన ఆరోపణలను ఒప్పుకున్న దాఖలాలు లేవు. కానీ ఓ హీరో మాత్రం తాను డ్రగ్స్ తీసుకున్న మాట వాస్తవమేనని అంగీకరించాడు. అయితే అతను టాలీవుడ్ హీరో కాదు, ప్రముఖ బాలీవుడ్ హీరో!

ప్రస్తుతం “జగ్గా జాసూస్” ద్వారా ధియేటర్లలో సందడి చేస్తోన్న రణబీర్ కపూర్, “తాను గతంలో డ్రగ్స్ తీసుకున్నానని” స్వయంగా తెలిపాడు. నిజానికి స్కూల్ కు వెళ్ళే రోజులలోనే తనకు డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉందని, అయితే క్రమంగా పూర్తిగా మానేసానంటూ చెప్పిన రణబీర్, ఆ తర్వాత సినిమాలో నటించడం కోసం డ్రగ్స్ తీసుకున్న సంఘటనను గుర్తుకు చేసుకున్నారు.

ADVERTISEMENT

2011లో విడుదలైన “రాక్ ఆన్” సినిమాలో స్టేజ్ పై ప్రదర్శన ఇచ్చే సన్నివేశంలో తాగినవాడిగా కనిపించాల్సి ఉందని, ఆ సన్నివేశంలో సహజత్వం కోసం తాను నిజంగా డ్రగ్స్ తీసుకున్నానని, అయితే అది చాలా తక్కువ మోతాదులో మాత్రమేనని చెప్పుకొచ్చారు. తెలుగు చిత్ర పరిశ్రమను డ్రగ్స్ రాకెట్ కుదిపేస్తున్న వేళ, రణబీర్ కపూర్ ఇచ్చిన ఈ ప్రకటన మీడియా వర్గాల్లో హైలైట్ అయ్యింది.

ADVERTISEMENT
Latest Stories