ప్రతీ ఏడాది కొన్ని సినిమాలు వండర్స్ చేస్తాయి…కొన్ని పాత్రలు అలా గుర్తుండి పోయేలా మెప్పిస్తాయి…మరి అలాంటి సినిమాలు…అలాంటి పాత్రలు ఈ ఏడాది కూడా చాలానే ఉన్నాయి…2018 చివరిలో ఉన్న మనం వాటిలో ది బెస్ట్ పాత్రలు…ది బెస్ట్ సినిమా ఏంటి అని ఆలోచిస్తే…
[m9ad]
ముందుగా హీరోల విషయమే తీసుకుంటే ఈ ఏడాదికి మన చిట్టి బాబే హీరో..రంగస్థలం పేరు చెప్పి చిట్టి బాబు చేసిన హంగామా అంతా ఇంతా కాదు..పైగా నటుడిగా చెర్రీని మరో మెట్టు పైకెక్కించిన పాత్ర ఇది…
ఇక ఈ ఏడాది ‘మహానటి’గా నిలిచిన పాత్ర…నిజంగా ఆ మహానటి సావిత్రి పాత్రలో జీవించిన కీర్తి సురేష్ దే..నిజంగా సావిత్రమ్మే దిగి వచ్చి నటిస్తుందా అనిపించేలా ఉంది ఈ పాత్ర…
ఇక సినిమా విషయమే తీసుకుంటే రంగస్థలం..రోబో లాంటి భారీ సినిమాలు ఉన్నా…15 కోట్ల లోపే బడ్జెట్ తో తెరకెక్కి..దాదాపుగా 75 కోట్లకు పైగా షేర్ వసూలు చేసిన ‘గీతా గోవిందం’ సినిమా ఈ ఏడాది టాప్ సినిమాగా..అత్యధిక ప్రేక్షక ఆదరణ పొందిన సినిమాగా చెప్పవచ్చు…
మొత్తంగా చూసుకుంటే మాత్రం ఈ ఏడాది ఇవే టాప్ అని చెప్పవచ్చు.



