ఇటీవల కాలంలో ‘లిప్ లాక్’ సీన్లకు వెండితెరపై కొదవలేదు. వర్ధమాన తారలంతా ఇలాంటి సన్నివేశాలకు ‘నో’ చెప్పకపోవడంతో లెక్కలేనన్నీ అధర చుంభనాలకు తెలుగు సినిమాలు నిలయంగా నిలుస్తున్నాయి. ‘సుప్రీం’ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తన భావాలు వ్యక్తపరిచిన రాశి ఖన్నా కూడా ఇలాంటి ‘లిప్ లాక్’ సీన్లకు తానేమీ అభ్యంతరం కాదని, తాను ఒక నటినని, పాత్రను బట్టి నటించాలి తప్ప, ఇందులో నటించను అంటే కుదరదని… అయితే ఏదైనా కధ డిమాండ్ చేయాలని అభిప్రాయపడింది.
“తను ఓ సినిమాలో నటించాలంటే కథ, కథనం, దర్శకుడు, హీరో నచ్చాలని” అన్న రాశి ఖన్నా.., ‘ఒకే భాషలో నటిస్తానని గిరి గీసుకుని కూర్చోలేనని, అవకాశం వస్తే ఏ భాషలోనైనా నటించేందుకు సిద్ధంగా ఉన్నానని… ప్రస్తుతం తెలుగు హీరోయిన్ గా ఆకట్టుకోవడం పట్ల సంతోషంగా ఉన్నానని’ తెలిపింది. ‘సుప్రీం’ సినిమాలో పాత్ర తనకు నచ్చిందని, ఈ సినిమాలో పోలీస్ పాత్ర కోసం సన్నబడ్డానని, ఫిట్ గా ఉండడం అభిమానులతో పాటు తనకు కూడా ఇష్టమని చెప్పుకొచ్చింది.
తన తోటి హీరోయిన్లు రకుల్ ప్రీత్ సింగ్, రెజీనాలతో మిక్కిలి సన్నిహితంగా ఉంటానని, తమ మధ్య సినీ కాంపిటేషన్ అన్న సమస్య లేదని, అవకాశాలు ఉంటాయి, ఉండకపోతాయి, స్నేహం మాత్రం చిరకాలం ఉంటుందని, అందుకే తామంతా స్నేహంగా ఉంటామని చిలక పలుకులు పలికింది. తమ అభిరుచులు ఒకటేనని, తామందరి కామన్ సబ్జెక్టు కూడా ఒక్కటే అదే ‘సినిమా’ అని, అందుకే తాము స్నేహంగా ఉంటున్నామని చెప్పింది.



