‘స్లమ్’ లుక్ రావడానికి “గుంటూరు టాకీస్” సినిమాకు సంబంధించిన షూటింగ్ అంతా అనంతపురం జిల్లాలోని నందమూరి బాలకృష్ణ నియోజకవర్గం అయినటువంటి హిందూపూర్ లో చిత్రీకరించామని, ఈ ‘స్లమ్’ లుక్ కోసం హైదరాబాద్ లో కొత్త కాస్ట్యూమ్స్ కొని, హిందూపూర్ లో నివసించే వారికి ఇచ్చి, చెప్పుకోవడానికి ఆస్కారం లేని విధంగా ఉన్న వారు ఉపయోగించిన కాస్ట్యూమ్స్ ను హీరో సిద్ధూకు వేసి షూట్ చేసారని, ఒకానొక సమయంలో సిద్ధూను చూస్తే తనకే జాలి వేసిందని, అంతలా సినిమా కోసం కష్టపడ్డామని చెప్పింది ఈ తెలుగు నేర్చిన పిల్ల.
ఈ సందర్భంగా హిందూపూర్ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని, వారు ఇచ్చిన సహకారం మరువలేనిదని, రాత్రి వేళల్లో 3 గంటల వరకు షూట్ చేసిన సందర్భాలు ఉన్నాయని, అయినా గానీ ఎలాంటి న్యూసెన్స్ చేయకుండా, కట్టేసిన రోప్ బయటే ఉండేవారని, దాదాపు రెండు, మూడొందలు మంది ఎప్పుడూ షూటింగ్ చూస్తూ ఉండే వారని, ఒక్కోసారి ఆ షూటింగ్ సన్నివేశాలను చూసి వారు కూడా నవ్వేసేవారని, వారి స్పందన మాకు మరింత ఉత్సాహం ఇచ్చిందని, ఇంత క్రమశిక్షణ కలిగిన హిందూపూర్ ప్రజలకు మరోసారి ధన్యవాదాలు చెప్తున్నానని, ఈ సినిమా ట్రైలర్ విడుదల చేసిన హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణ గారికి ఈ సందర్భంగా థాంక్స్ చెబుతున్నానని, సినిమాను వెండితెరపై చూసి ఆశీర్వదించమంటూ ప్రేక్షకులను కోరింది ‘జబర్దస్త్’ బ్యూటీ.





