‘పుష్ప’ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ ల విషయంలో ఒక్క అల్లు అర్జున్ పోస్టర్ మినహా, మిగిలిన అన్ని పోస్టర్లపై ప్రేక్షకులు, సినీ విమర్శకులు పెదవి విరిచిన విషయం తెలిసిందే. అయితే హీరోయిన్ రష్మిక మాత్రం తన ఫస్ట్ లుక్ పోస్టర్ పై ముందే చెప్పిందట.
చెవులకు దిద్దులు పెట్టుకుంటూ పైట లేకుండా కూర్చోని ఉన్న పోస్టర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఈ పోస్టర్ రిలీజ్ కు కొద్ది సమయం ముందే రష్మికకు పోస్టర్ పంపించగా, ఈ పోస్టర్ అయితే తనపై నెగటివ్ అభిప్రాయాలు వస్తాయని రష్మిక తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసిందట.
ఇది తెలుసుకున్న సుకుమార్, తాను ఎంతో కష్టపడి, ఆలోచించి రిలీజ్ చేస్తోన్న పోస్టర్ పై రష్మిక అలా అన్నందుకు తీవ్ర కోపం వచ్చిందట. ఎవరెన్ని చెప్పినా తాను అనుకున్న పోస్టర్ నే రిలీజ్ చేస్తానని, ఆ పోస్టర్ ను రిలీజ్ చేసానని, కానీ తర్వాత రష్మిక చెప్పిందే నిజమైందని సుకుమార్ చెప్పుకొచ్చారు.
బాలయ్య ‘అన్ స్టాపబుల్’ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంలో సుక్కు ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ… ఈ సందర్భంగా తాను రష్మికకు ‘సారీ’ చెప్తున్నానని అన్నారు. నిజమే మరి… హీరోయిన్ కూర్చున్న తీరు, బాడీపై ఉన్న కాస్ట్యూమ్స్, ఎదురుగా మల్లెపూలు… ఇలా ఈ పోస్టర్ ఎవరు చూసినా అభ్యంతరకరంగా ఉందని ఇట్టే చెప్పేస్తారు, మరి సుక్కుకు ఎందుకు వెలగలేదో?!



