నెక్స్ట్ మూవీస్ పై రవితేజ క్లారిటీ!

Ravi Teja about his next moviesశుక్రవారం నాడు “అమర్ అక్బర్ అంటోనీ” సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం ప్రమోషన్స్ లో భాగంగా మీడియాలకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన తదుపరి సినిమాల గురించి ఓ స్పష్టత ఇచ్చారు.

ADVERTISEMENT

[m9ad]

సంతోష్ శ్రీనివాస్ తో చేయాల్సిన “తేరి” సినిమా రీమేక్ చేయడం లేదని, కొత్త స్క్రిప్ట్ ను రెడీ చేస్తున్నాడని తెలిపారు. ఇక పూరీ జగన్నాథ్ తో ఓ సినిమా చేయాల్సి ఉందని తెలిపిన రవితేజ, కొత్త కధలను చేయడానికి ప్రయత్నిస్తానని అన్నారు. అలాగే మైత్రీ మూవీ మేకర్స్ తో గానీ, ఇతర ఏ ప్రొడక్షన్ హౌస్ తో గానీ ఎలాంటి డీల్ కుదుర్చుకోలేదని తెలిపారు.

హాలీవుడ్ ‘టేకెన్’ లాంటి సినిమాలు ఇష్టమని, అలాంటి సినిమా చేయాలనీ ఉంటుందని, ఈ ‘అమర్ అక్బర్ అంటోనీ’ స్క్రిప్ట్ ఇద్దరికీ కొత్తగా ఉందని, గత సినిమాల మాదిరి స్పూఫ్ లు ఉండవని, ఈ మూడు పాత్రలలో అమర్ పాత్ర తనకు బాగా నచ్చిందని, మిగిలిన రెండు పాత్రలు కామెడీగా ఉంటాయని అన్నారు రవితేజ.

ADVERTISEMENT
Latest Stories