ఆ భయం రవితేజకు కూడా ఉంది గానీ కన్విన్స్ అయ్యాడు

Ravi Teja liplock with Meenakshi Chaudharyమాస్ మహారాజా రవితేజ తన తాజా చిత్రం… క్రాక్ అన్ని అవరోధాలని దాటి సంక్రాంతి విజేతగా అవతరించడంతో తరువాత చాలా హుషారుగా ఉన్నాడు. ఈ నటుడు తన తదుపరి చిత్రం ఖిలాడి కోసం విశాఖపట్నంలో షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. తాజాగా అక్కడ హీరో మీనాక్షి చౌదరితో కలిసి నటుడు లిప్ లాక్ సన్నివేశంలో పాల్గొన్నట్లు సమాచారం

రవితేజ ఆ సన్నివేశం చేయటానికి వెనుకాడారు కాని దర్శకుడు రమేష్ వర్మ అతన్ని ఒప్పించాడని మనకు ఉన్న సమాచారం. మొన్న ఆ మధ్య నాగార్జున మన్మథుడు 2లో ఒక లిప్ లాక్ చెయ్యడంతో చాలా విమర్శలు వచ్చాయి. దానితో సీనియర్ హీరోలు అటువంటివి చెయ్యడానికి జంకుతున్నారు.

ADVERTISEMENT

ఎలాగైతే మొత్తానికి రవితేజ అటువంటి సీన్లో కనిపించబోతున్నారు. మరోవైపు.. రెండు వారాల పాటు జరిగే షెడ్యూల్ కోసం ఈ బృందం అతి త్వరలో ముంబైకి వెళ్తుంది. మూవీ షూటింగ్ 50% పూర్తయింది. డింపుల్ హయాతి ఈ చిత్రంలో మరో హీరోయిన్. ఈ చిత్రం వేసవిలో తెరపైకి రానుంది. రవితేజ ఈ చిత్రంలో డబల్ రోల్ లో కనిపించనున్నాడు.

ఈ చిత్రానికి కొనేరు సత్యనారాయణ నిర్మాత. రవితేజ ఈ చిత్రాన్నిహిట్ చేయడానికి చాలా ఆసక్తిగా ఉన్నారు. క్రాక్ తో కష్టపడి సంపాదించిన విజయ పరంపరను కొనసాగిస్తున్నారు. ఈ వేసవిలో అతని కోసం ఏమి ఉందో చూద్దాం. రవితేజ, రమేష్ వర్మ గతంలో వీర సినిమా ఇచ్చిన సంగతి తెలిసిందే.

ADVERTISEMENT
Latest Stories