‘ఎవడో ఒకడు’లో మునుపటి రవితేజ!

ravi-teja-yevado-okkadu-movieమాస్‌ మహారాజ రవితేజ హీరోగా నటించిన ‘కిక్‌ 2’ చిత్రం ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా అట్టర్‌ ఫ్లాప్‌ అయ్యింది. ఆ సినిమా ఫ్లాప్‌ అవ్వడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. ఆ కారణాల్లో ఒక్కటి రవితేజ చాలా స్లిమ్‌గా కనిపించడం. గతంలో రవితేజ సాలిడ్‌ బాడీతో మొహంలో కలతో కనిపించేవాడు. కాని ‘కిక్‌’ సినిమాలో చాలా స్లిమ్‌ అవ్వడం వల్ల మొహంలో జీవం లేకుండా పోయంది. ఇక వచ్చే వారం విడుదల కాబోతున్న ‘బెంగాల్‌ టైగర్‌’లో సైతం రవితేజ చాలా బక్క పల్చగా కనిపించబోతున్నాడు. ఈ సినిమాలో సైతం రవితేజ లుక్‌ ఆకట్టుకునే విధంగా లేదు అనే టాక్‌ వస్తోంది. దాంతో దిల్‌రాజు తాను నిర్మించబోతున్న సినిమా కోసం రవితేజను మునుపటి రూపంలోకి రావాల్సిందిగా కోరినట్లుగా తెలుస్తోంది.

వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో దిల్‌రాజు నిర్మాణంలో రవితేజ హీరోగా ‘ఎవడో ఒకడు’ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెల్సిందే. ఇప్పటికే ఒక స్క్రిప్ట్‌ వర్క్‌ కూడా పూర్తి అయిన ఆ సినిమాను ‘బెంగాల్‌ టైగర్‌’ చిత్రం విడుదల అయిన వెంటనే రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభించబోతున్నారు. షూటింగ్‌ ప్రారంభంకు ముందే రవితేజతో దాదాపుగా 10 కేజీలు పెరగాల్సిందిగా దిల్‌రాజు చెప్పినట్లుగా సమాచారం అందుతోంది. రవితేజ మునుపటి లుక్‌తో నటించబోతున్న ‘ఎవడో ఒకడు’ చిత్రం లక్‌ కలిసి వచ్చి సక్సెస్‌ అయ్యేనో చూడాలి.

ADVERTISEMENT
Latest Stories