అనుష్క కోసం తగ్గిన రవితేజ

raviteja postponed bengal tiger for size zero movieమాస్‌ రాజా రవితేజ నటించిన ‘బెంగాల్‌ టైగర్‌’ చిత్రం వరుస వాయిదాలు పడుతోంది. మొదట ‘అఖిల్‌’ వల్ల వాయిదా పడ్డ ఈ చిత్రం తాజాగా ‘సైజ్‌ జీరో’ వల్ల వాయిదా వేశారు. నిన్న మొన్నటి వరకు ‘బెంగాల్‌ టైగర్‌’ చిత్రాన్ని ఈనెల చివరి వారంలో విడుదల చేయాలని భావించారు. అయితే అదే సమయంలో ‘సైజ్‌ జీరో’ మరియు ‘శంకరాభరణం’ చిత్రాలు విడుదలకు సిద్దంగా ఉండటంతో వాటికి లైన్‌ క్లీయర్‌ చేసిన టైగర్‌ డిసెంబర్‌కు వాయిదా పడ్డాడు.

‘రచ్చ’ ఫేం సంపత్‌ నంది దర్శకత్వంలో రవితేజ, తమన్నా జంటగా రాశిఖన్నా మరో హీరోయిన్‌గా తెరకెక్కిన ‘బెంగాల్‌ టైగర్‌’ చిత్రాన్ని వచ్చే నెల 10న విడుదల చేస్తామంటూ చిత్ర యూనిట్‌ సభ్యులు అధికారికంగా ప్రకటించారు. ‘బెంగాల్‌ టైగర్‌’, ‘సైజ్‌ జీరో’, ‘శంకరాభరణం’ చిత్రాల నిర్మాతలు ఒకరికొకరు ఒప్పందం కుదుర్చుకుని, మాట్లాడుకుని పోటీ లేకుండా మంచి వాతావరణంలో రావాలని ఇలా నిర్ణయించుకున్నారు. మొత్తానికి ఈ మూడు సినిమాలు ఒకే సారి వచ్చి నష్టపోకుండా బ్యాక్‌ టు బ్యాక్‌ వచ్చి ప్రేక్షకులను అలరించి, మంచి ఓపెనింగ్స్‌ రాబట్టుకునే అవకాశాలున్నాయి. గత కొంత కాలంగా ఇండస్ట్రీలో ఇలాంటి పద్దతి కొనసాగుతున్న విషయం తెల్సిందే.

ADVERTISEMENT
Latest Stories